విద్యావ్యాసంగ జీవితంలో ఉన్న మాధుర్యవిహీనతను నేనెప్పటికైనా జయించలేకపోయినాను. అయినప్పటికీ నాకు ఆనందసమయాలంటూ లేకపోలేదు. అయితే నాకు సంతోషాన్ని ప్రసాదించేవి (కొంతవరకైనా చెప్పవలసివస్తే) నీతివిరహితాలు, గౌరవరహితాలూ అయిన కృత్యాలు మాత్రమే. పదిమందితో పరిచయాన్ని సంపాదించి గౌరవాన్ని పొందుతూ పెద్దతనాన్ని పెంపొందించుకున్నవాణ్ణి కావటం వల్ల, నా ప్రవర్తనలోని బహిరంతరస్వభావాలకు పొత్తు కలియకపోవటం నాకే ఎంతో అసహ్యాన్ని కలిగిస్తుండేది. ఒకవంక క్రొత్తగా ఆర్జించుకొన్న మహిమకు నేను బానిసనైపోతున్నాను. సుప్రసిద్ధుడైన వైద్యవిద్యావేత్త రూపాన్ని విసర్జించి ఎడ్వర్టు హైడ్ మూర్తిని పొందటానికి ఇక గిన్నెడు మందు త్రాగితే చాలు. ఈ రూపపరివర్తన వైచిత్రికి నాకే నవ్వు వస్తుండేది. ఈ క్రియ ఎంతో పరిహాసాస్పదంగా నాకు తోచేది. అతితీక్షమైన శ్రద్ధతో కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. ఇంటిదగ్గిరి పోలీసు వారు హైడు అన్వేషిస్తూ వస్తారని గుర్తించి, సోహోప్రాంతంలో ఆ ఇంటిని పుచ్చుకొన్నాను. అందులో అవసరమైన అమరికలను అన్నింటినీ ఏర్పాటు చేశాను. దానికి నిరంతరం ఎటువంటి నీచకృత్యానికైనా జంకని వ్యక్తిని ఒకణ్ణి కాపలాదారుడుగా నియమించాను. మరొక వంక చౌతరాలో ఉన్న నా ఇంట్లో (నేను బాగా పూర్వం వివరించి చెప్పినట్లు) ఎడ్వర్టు హైడ్ సమస్తస్వేచ్ఛనూ, సర్వాధికారాన్నీ కలిగి ప్రవర్తించటంకోసం అతనికి ఎటువంటి అభ్యంతరాలూ కలిగించరాదని ఎరుకపరిచాను. ఇంకా ఏవైనా అవాంతరాలు సంభవించటానికి అవకాశం ఉంటుందనే దృష్టితో, నా ద్వితీయరూపంతో నా ఇంట్లో ఉండే వారందరికీ పరిచయం కలిగించాను. ఒకవేళ నా డాక్టర్ జెకిల్ రూపానికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే, నా ఆస్తిపాస్తులకు నష్టం కలుగకుండా ఎడ్వర్టు హైడ్ అనే పేరుతో వాటికి కర్తను కావాలెననే ఉద్దేశంతో, తరువాత మీరు విశేషంగా వ్యతిరేకిస్తూ వచ్చిన, ఇచ్ఛాపత్రాన్ని వ్రాసి ఉంచాను. రాగలిగిన ప్రమాదాలకు నా ఊహ కందినంతలో తగిన కట్టుదిట్టాలను చేసి, నాకు లోకంలో ఉన్న స్థితివల్ల కలిగే సమస్తగౌరవాదరాలనూ పొందాను.
లోకంలో ఇంతవరకూ పెద్దమనుషులు ఏవైనా నేరాలను చేయించ దలచుకొంటే కొంతమంది సాహసికులను నియమించి తమ వ్యక్తిత్వానికీ, ప్రతిష్ఠకూ భంగం రాకుండా కాపాడుకొంటూ వస్తున్నారు. ఆత్మోత్సాహాన్ని తీర్చుకోటం కోసం ఇటువంటి ఘోరనేరాలను స్వయంగా చేయగలిగిన ప్రథముణ్ణి నేనైనాను. ప్రజాదృష్టిలో అనురాగపూర్వకమైన గౌరవాన్ని అనంతంగా పొందుతూ, ఒక్కక్షణకాలంలో ఒక తన్ను తన్ని పారేసినట్లు విప్పేసినట్లు, ఒక విద్యార్థిలా, స్వేచ్ఛామహాసాగరంలో ముందువెనకలు డాక్టర్ జెకిల్ - మిస్టర్ హైడ్ 539