పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/533

ఈ పుటను అచ్చుదిద్దలేదు

10. హెన్రీ జెకిల్ సమగ్ర వాఙ్మూలం

"నేను ఒక సంపన్నగృహంలో 18 - సంవత్సరాన జన్మించాను. ప్రకృతి సిద్ధంగా నాకు మంచి బుద్ధిబలం లభించింది. శ్రమపడటమంటే నాకు సహజంగా ఎంతో ఇష్టం. విద్వాంసుల మన్ననలూ, సాటివారి ఆదరణ పొందాలని నాకూ అభిలాష అధికం. అందువల్ల నాకు గౌరవార్హమూ, విశిష్టమూ అయిన భవిష్యత్తు ఉండి తీరుతుందని ఊహించటానికి తగ్గ అవకాశాలన్నీ ఉన్నాయి. నాలో ఉన్న లోపమల్లా ఒక్కటే. ముందు వెనుకలు ఆలోచించకుండా ఖుషీగా ఉండే తత్త్వం. ఈ తత్త్వంతో ఎందరి జీవితాలో సుఖంగా గడిచి పోయాయి. కాని పదిమందిలో, తీక్షమైన ముఖంతో, హుందాగా, తలయెత్తుకొని తిరగాలెనన్న తీవ్రమైన వాంఛకూ, పైతత్త్వానికీ పొంతన కుదరటం కష్టమని తేలింది. అందుచేత ఆనందాల నన్నిటినీ నాలోనే గుప్తంగా దాచిపెట్టానన్నమాట! ఆత్మపరిశోధన చేసుకోగల వయస్సు వచ్చిన తరువాత, ఒక్కమారు నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలించుకొని, ప్రపంచంలో నా స్థితినీ, అభివృద్ధినీ గురించి విమర్శించుకొన్నాను. అప్పటికే నాలో తీక్షంగా ఈ ద్వంద్వప్రకృతి స్థావరాన్ని కల్పించుకొన్నట్లు గుర్తించాను. నాలో ఉండి నా దృష్టికి లోపాలుగా తోచిన అవలక్షణాలు ఉన్నవాళ్ళు ఎంతోమంది, వాటిని గొప్ప చేసి బాహాటంగా లోకంలో వెల్లడించుకుంటున్నారు. కానీ నేను కొన్ని ఉత్తమజీవితలక్ష్యాలను పెట్టుకోటంవల్ల సిగ్గుపడి, వాటిని గుప్తంచేసి ప్రవర్తిస్తూ వచ్చాను. మానవుల్లో సామాన్యంగా ఉండేవాటికంటే ఈ గుణాలు నాలో అతితీవ్రంగా ఉండి ఒక మహాగర్తాన్ని నిర్మించి నన్ను ఈ రీతిగా రూపొందించాయి. నాలో పొత్తు కలియని సుగుణదుర్గుణరాజ్యాలు రెండేర్పడ్డాయి... అగర్తం ఒక వంక రెంటినీ కలుపుతూ, మరొకవంక విడగొట్టుతూ ఉంది. ఇటువంటి ద్వంద్వస్వభావం, ఇటువంటి ద్వంద్వప్రవృత్తి ప్రతివ్యక్తిలోనూ సమ్మిళితమై ఉంటుంది. కానీ కొందరు వ్యక్తుల్లో ఇది విడివడి కూడా ఉంటుంది. ఇవి నాలో పరిపూర్ణంగా విడివడ్డాయి. ఇందుకు కారణం నాలో ఉన్న అవలక్షణాలు తీవ్రాతితీవ్రమైనవి కావటమే. ఎండని నీటిబుగ్గలా మతానికి మూలమూ, దుఃఖహేతువూ అయిన ఈ మానవజీవిత ధర్మసూత్రాన్ని గురించి తీవ్రంగా నేను వివేచన ఆరంభించాను. ఇంత విశిష్టమైన ద్వంద్వప్రవృత్తి కలవాడిని అయినప్పటికీ నేను