జీవితానికి గానీ ఉన్న సంబంధం ఏమిటి? అతడి వార్తావహుడు సమయానికి రాలేకపోవటం ఎందుకు జరుగుతుంది? అతన్ని ఒక పనిమీద పంపితే అక్కడికి చేరగలిగినప్పుడు, మరొక పనిమీద మరొకచోటికి పంపితే చేరలేకపోవటం ఎలా జరుగుతుంది? ఒకవేళ ఏదైనా అంతరాయం కలగవచ్చుననే అనుకుందాం. అతన్ని నేను రహస్యంగా ఎందుకు ఆహ్వానించాలి? దీన్నిగురించి ఆలోచించిన కొద్దీ ఒక మానసిక వ్యాధిగ్రస్తునితో నేను వ్యవహరిస్తున్నానన్న విశ్వాసం నాకు గాఢం కావటం ప్రారంభించింది. సేవకులందరూ నిద్రించవలసిందని ఆజ్ఞాపించినప్పటికీ, ఆత్మరక్షణ చేసుకోవలసిన పరిస్థితి ఏదైనా ఏర్పడుతుందేమో అన్న ఉద్దేశంతో, నా రివాల్వరు నిండా తూటాలు ఎక్కించి ఉంచాను.
“లండన్లో పన్నెండు గంటలు పూర్తిగా వినిపించాయో లేదో, ఎవరో వచ్చి నెమ్మదిగా వారి తలుపు తట్టారు. పిలుపు విని నేనే స్వయంగా వెళ్ళి నావలభిలో స్తంభాలకు చాటుగా నక్కిఉన్న ఒక మరుగుజ్జు మనిషిని చూచాను.
“నీవు డాక్టర్ జెకిల్ పంపిస్తే వచ్చావా?" అని అతన్ని ప్రశ్నించాను.
"అతడు గొంతు బిగబట్టినట్లుగా నటించి “ఔ” నని సంజ్ఞ చేశాడు. లోపల ప్రవేశించివలసిందని నేను ఆజ్ఞాపించినప్పుడు, అతడు ఒకమాటు వెనక్కు తిరిగి దూరాన ఉన్న చత్వరంలోని అంధకారంలోకి తన అన్వేషణాత్మకదృష్టిని నిగుడుకుండా దాన్ని పాటించ లేకపోయినాడు. అవతలి దూరంలో ఒక రక్షకభటుడు తన 'అనధ్వనేత్రాన్ని' విస్ఫారితం చేసి ముందుకు నడిచి వస్తున్నాడు. అంతటితో ఆ ఆగంతుకుడు కదిలి అతివేగంగా ఇంట్లోకి నడవసాగాడు.
"ఈ విశేషాలన్నీ నాకు చాలా అసహ్యాన్ని కలిగించాయని నేను తప్పక ఒప్పుకొని తీరుతాను. నేను రోగులను సంప్రదించే గదిలోకే అతన్ని నడిపిస్తున్నాను. అతన్ని అనుసరిస్తున్నప్పుడు నా చేయి ఆయుధంమీదనే పెట్టి ఉంచాను. ఆ గదిలోకి వెళ్ళింతరువాత అక్కడ నేను అతన్ని స్పష్టంగా చూడగలిగాను. అంతవరకూ నా కళ్ళను ఒక్కమారైనా అతడిమీదికి ప్రసరించలేదు. నేను వెనక చెప్పినట్లు అతడు పొట్టివాడు. అంతేకాదు, అతని కండరాల కదలిక శరీరదౌర్బల్యంతో మిళితమై, అతని ముఖంలోని కఠోరభావాన్ని వ్యక్తం చేస్తున్నది. ఇది నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. ఇరుగుపొరుగువారు కల్పించిన వ్యథలవల్ల ఆ వ్యక్తి అలా ఐపోవటం నన్ను అన్నిటికంటే విశేషంగా ఆకర్షించింది. కొన్ని నిర్బంధనియమాలను శరీరాన్ని కట్టిపడేయటంవల్ల