తీసుకున్నావనీ, ప్రజలను హింసించి ధనం దోచుకున్నావనీ నిందిస్తాడు. అనతికాలంలోనే ఇరువురి మధ్యా సంధి కుదురుతుంది. వెంటనే బ్రూటస్ తన భార్య పోర్షియా మరణాన్ని గురించి కాషియస్ కు తెలియజేస్తాడు. తరువాత కాషియస్ సలహాను అతిక్రమించి బ్రూటస్ సైన్యాలతో ఫిలిప్పీవరకూ ఎదురువెళ్ళి శత్రువులను ఎదుర్కోవలెనని నిర్ణయిస్తాడు. ఏకాంతంగా ఉన్న బ్రూటను సీజర్ భూతరూపం కనిపించి అతడికి తిరిగి ఫిలిప్పీ యుద్ధభూమిలో దర్శనమిస్తానని చెప్పిపోతుంది (అం.4-దృ3).
ఉభయసైన్యాలు మాసిడోనియాలోని ఫిలిప్పీవద్ద కలుసుకుంటాయి. ఉభయపక్షాల నాయకులు మాట్లాడుకుంటారు. కాని నిష్ప్రయోజన మౌతుంది. తుదిసారిగా కాషియస్ బ్రూటస్ లిరువురూ కలుసుకొని పరస్పరం వీడ్కోలులు స్వీకరిస్తూ అవసరమైతే ఆత్మహత్యకు సంసిద్ధులైనట్టు వెల్లడించుకుంటారు (అం.5 దృ1). బ్రూటస్ తన సైన్యాలకు అనుజ్ఞ ఇచ్చి అవతల వైపున ఉన్న సైన్యాలను హఠాత్తుగా ఆక్టేవియస్ మీదికి పంపించేటట్లు చేయమని మోసెల్లాను పంపుతాడు (అం.5 దృ2). పొరబాటు వల్ల పిండారస్ లో ప్రథమయుద్ధంలో కాషియస్ సైన్యాలు ఓడిపోతవి. అతడు దూరం నుంచి వచ్చేవి మిత్రసైన్యాలో శత్రుసైన్యాలో చూచిరావలసిందని టిటినియన్లను పంపిస్తాడు. టిటినియస్ పట్టుపడ్డట్లు వార్త తెస్తాడు. కాషియస్ నిరాశ చెంది సేవకుడిచేత పొడిపించుకొని మరణిస్తాడు. టిటినియస్ తిరిగి వచ్చి జరిగినది చూచి తానూ ఆత్మహత్య చేసుకుంటాడు. బ్రూటస్ జరిగిన ఈ ఉదంతాన్నంతటినీ మోసెల్లా వల్ల విని కాషియస్ టిటినియన్లను మహోదాత్తులైన తుది రోమనులని పొగిడి, వారి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయిస్తాడు (అం. 5-దృతి). యుద్ధభూమికి వెళ్ళి బ్రూటస్ తిరిగి ఒక యత్నం చేస్తాడు. ఆంటోనీ సైనికులు లూసిలియస్ ను పట్టుకొని అతడే బ్రూటస్ అనే భ్రాంతితో తమ నాయకుడిదగ్గరికి తీసుకోపోతారు. అంటోనీ సత్యాన్ని గ్రహిస్తాడు (అం.5-దృ4). తనకు విజయం అలభ్యమైపోయిందని నిర్ణయించుకున్న బ్రూటస్, తన్ను చంపవలసిందని మిత్రులను అర్థిస్తాడు. చివరకు 'స్ట్రాటో' అనే అతణ్ణి బలవంతపెట్టి అతడు కత్తిని పట్టుకోగా తాను దానిమీదపడి ప్రాణాలు తీసుకొంటాడు. ఆ స్థలానికి ఆంటోనీ, ఆక్టేవియస్ వచ్చి బ్రూట న న్ను స్తుతించి ఆయనకుచిత మర్యాదలతో అంత్యక్రియలు జరిపిస్తామని ప్రకటిస్తారు కీర్తిప్రతిష్ఠలను పంచుకోవటానికి నిష్క్రమిస్తారు. జూలియస్ సీజర్ 17