విజయాన్ని చేకొని వస్తున్న సీజర్ను మహావైభవంతో ఆహ్వానించటానికి, ఆ నాటిని సెలవు దినంగా భావించి వీథుల్లో గుంపులుగా చేరుకుంటారు. ప్రజాధర్మాధికారులైన స్లేవియస్, మారులస్ పాంపేయెడ వారి కృతఘ్నతకు నిందిస్తూ చెదరగొడతారు (అం1-దృ1). లూపర్ కేలియో ఉత్సవాలకు వెడుతున్న జనసమూహానికి ముందు సీజర్ పరివారంతో నడుస్తుంటాడు. ఒక శకునజ్ఞుడు అతణ్ణి 'మార్చి పదిహేనో నాడు జాగ్రత్త!' అని హెచ్చరిస్తాడు. సీజర్ అతణ్ణి 'ఎవరో స్వాప్నికుడని త్రోసిపుచ్చి క్రీడలను చూడటానికి వెళ్ళిపొమ్మంటాడు. కాషియస్ బ్రూటస్ ను ప్రక్కకు తీసికోపోయి సీజర్ జీవితంమీద జరిగే కుట్రలో చేరవలసిందని ఉద్బోధిస్తాడు. క్రీడలైపోయి సీజర్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళతో కాస్కా చేరి, సీజర్ ఆంటోనీ అర్పించిన రాజకిరీటాన్ని ఎలా ముమ్మారు త్రోసి పుచ్చాడో వివరిస్తాడు. బ్రూటస్ మనస్సులో సీజర్ ఆశాపరత్వాన్ని గురించిన ఆలోచన ఆరంభమౌతుంది. (అం1-దృ2). కాస్కా సిసెరోను కలుసుకొని కనిపించిన దుశ్శకునాల నన్నింటినీ వివరిస్తాడు. సిసెరో వెళ్ళిపోయిన తరువాత కాషియస్ అతణ్ణి కలుసుకొని, అంతకు పూర్వమే దుశ్శకునాలకు కలవరపడుతున్న అతని మనస్సుకు నచ్చచెప్పి, హంతకవర్గంలో చేర్చుకుంటాడు. అక్కడికి వచ్చిన సిన్నా కూడా వారిలో చేరుతాడు. ముగ్గురూ బ్రూటస్ ను తమవాణ్ణి చేసుకోవటానికి పథకం వేస్తారు (అం 1 - దృ3)
సీజర్ ఆశాపరత్వం రోముకు ప్రమాదకారి అని భావిస్తూ మానసికాందోళనతో బ్రూటస్ తన ఫలోద్యానంలో రాత్రి నంతటినీ గడుపుతుంటాడు. హంతకులు వాతాయనంగుండా పడవేసిన ఉత్తరాలను చూచి రోము క్రూరపాలనకు పాల్పడకుండా చేయటంకోసం 'సీజర్ ను ఆరంభదశలోనే హతమార్చటానికి' నిర్ణయిస్తాడు. విద్రోహకవర్గం ఆయన్ను కలుసుకున్న తరువాత చర్చించి హత్యాపథక వివరాలను నిర్ణయిస్తారు. ప్రమాణాలు తీసుకోవాలెననీ, ఆంటోనీని కూడా తుదముట్టించాలెననీ, సిసెరోను కలుపుకోవాలెననీ కాషియస్ చేసిన సూచనలను బ్రూటస్ వ్యతిరేకిస్తాడు. కాషియస్ లొంగిపోతాడు. సభాభవనంలో సీజర్ ను మరునాడు చంపటానికి అంతా అంగీకరించి వెళ్ళిపోయిన తరువాత, బ్రూటస్ భార్య పోర్షియా వచ్చి ఆ రహస్య సమాలోచన లేమిటో, కళవళపెట్టే విశేషాలేమిటో తెలియజేయవలసిందని ప్రార్థిస్తుంది (అం.2-దృ1). మర్నాడు సీజర్ భార్య కల్పూర్నియా శకునజ్ఞుని సూచననూ, రాత్రి తనకు వచ్చిన కలనూ చెప్పి, సీజర్ ను సభాభవనానికి వెళ్ళకుండా నిర్బంధిస్తుంది. సభాసభ్యుల్లో ఒకడైన డెసియస్ వచ్చి కల్పూర్నియా కల సవ్యమైనదని చెప్పి మరొక జూలియస్ సీజర్ 15