ఈ పుట అచ్చుదిద్దబడ్డది
మనునీతి
అవిగో ఆకాశంబున అపసూచన లెన్నెన్నో!
రూపరిపోవుచు నున్నవి రూఢిలేక ఋక్షంబులు!
పడిపోవుచు నున్న వవే పలురిక్కలు నిముసములో!
రాకాయామిని వేళల రానేలా యంధతమము!
వేచెడు నా మానస మీ విధికృత్యము లీరోజున
ఈయపదర్శనములు నా కేమపకీర్తిం దెచ్చునొ!
ఏవిలయము రానున్నదో ఈ చోళధరాలతలమున!
కాశబ్దం బేమి యగునొ! అంబాకృప యెట్లున్నదొ!
సౌవిదల్లుడు
న్యాయమును కాంక్షించి నరనాథ! ఎడతెగక
అర్ధరాత్రమునందు అచలములు మార్ర్మోగ
ధర్మఘంటిక నెవరొ తట్టుచున్నా రచట.
మనునీతి
కర్ణంబులు చిల్లులువడ కలకల మాకర్ణించియు
తలపోయగ లేనై తిని ధర్మఘంటికా రవముగ!
నాకనులకు కనుపించిన నానా యశుభంబులు నా
మతి యంతయు కళవళించి మార్పేమియొ చేకూర్చెను!
ఈ నిశీధి నీవిధమున నెంత ప్రబలకారణంబ
ఆగ్రహణం బనరింపగ నతని, కేమిచేటయ్యెనొ!
గేయ నాటికలు 565