మురళిరవళులు తొలకరించెను
చేతనమ్ములు పులకరించెను.
అలలు తేరిన కలతదీరిన
మురళి తరళిమ సరళిలో చిఱు
తొగరు పెదవుల నెగయు సుధలో
పులకరించెను రసిక వాహిని. 28
(వీక్షించి) ఓహో, ఈ పొగడ చెట్టు వైపుననే సఖుడు. రసాలకుడు వెంటరాగా
రాధిక యనురాగకళికను వికసింప జేసికొనుచున్నది. నేనును సంభావించెదను.
రాధిక: (సమీపించి) ఈ యవతంస నీలోత్పలము నింతగా సంభావింతు
వేమి విశేషము?
వకుళమాలిక: (రాధికచెవి దగ్గరకు జేరి)
ఉజ్జ్వలోత్పల కోరకమ్మది
యుండ నే కాంతముగ నీతో
నవ్యతను తా నందనందన
నయన నీతి వినిర్జితమ్మై
నందసూను శ్రవఃకపోలము
విడిచి భృగుపాతమ్ము నొందెనె! 29
రాధిక : సఖీ! ఈ కర్ణావతంసముచేత బ్రతికితిని.
నవమాలిక: సఖీ! అలంకరింపబడిన కృష్ణునిచేతనా?
(ఆకాశమున)
ఓహో, మురారి మురళి! ఉరునాందీ మధుసరళి!
రాసోత్సవ నాటికలో జగముల ప్రస్తావించును
మునివర్యుల హృదయములను ముగ్ధభావవశమొనర్చు. 30
అందఱును: (ఆనందముతో) నిజము! నిజము!! (మదనావస్థ నటింతురు)
రసాలకుడు: (పులకించి, అంజలి వహించి)
ఒక్క వాక్కుకు, మనసు కొదుగంగ బోనిదియు
ఒక్క యాకారమని యొప్పుకొనబోనిదియు
542
వావిలాల సోమయాజులు సాహిత్యం-2