గతి జేరి నిను, దారటాడితిమి తన్విరో!
నిండుగా గల్పించు నిది యెల్ల నచ్చెరువు. 25
సఖీ : ఈ మురారి రూప శ్లోకనము నిన్ను గూర్చియే. (అందఱు “కాదు,
కాదు నిన్ను గూర్చియే” అని కలహింతురు)
ప్రేమకళ: (ఆత్మగతముగ)
పాదద్వయమ్ము నూపురపూరితమ్ముగను,
కటితటిని పీతాంబరాలంబనమ్ముగను,
వక్షమున కుంకుమము, వేణుస్వనమునందు
నందనరసస్యంది, అమృతారుణోష్ఠమున
ప్రసరించు హసనమ్ము, పింఛచూడమ్ముతో
విభ్రమము వెలయు నా నీలమేఘము నొంద
నెవ రొనర్చిరొ కదా, యింత ఘనతర తపము? 26
(నేపథ్యమున)
“రాకా శీత మయూఖుని బోలెడు
సుందర వదనుడు, విస్ఫారోన్నత
వక్షఃస్థలుడును, ఖేలత్కేసరి
మధ్యముడును, మదగజరాడ్గర్వా
పహడును మరకత సంపదోర్డం
బరుడౌ శ్రీపతి రమ్యాకారుం
డెవ్వరి రంజింపం డీ సృష్టిని?” 27
ప్రేమకళ: (దర్శించుట నటించి) నీలోత్పలమును మాటిమాటికి
హృదయమునకు హత్తుకొనుచు వకుళ మాలిక సంబరముతో
మురిసిపోవుచు నిటే వచ్చుచున్నది.
వకుళమాలిక : (వర్ణితమైనట్లు ప్రవేశించి)
ముగ్ధమోహన మంజులమ్మగు
మధుర తరళిమ సరణిలో మధు
తృప్త చుంబన కళల పోలిక
తొగరు పెదవుల నెగయు సుధలో
పీయూషలహరి
541