ప్రేమకళ : రసాలకుడు హస్తగత చిత్ర ఫలకముతో నిటె వచ్చుచున్నాడు.
రసాలకుడు: (వర్ణితు డయినట్లు ప్రవేశించి)
తారహార సుందరు ఘను
నీల నీరదోరు ధాము
పాలితువలె లీల గొలుతు,
వామనీకృతస్తనాంత
వల్లవీ నికామ కామ
నీతిరసికు ప్రేమ గొలుతు. (24)
రాధిక : ఈ రసాలకుని హస్తమునందున్న యీ చిత్ర ఫలకమే సర్వానర్ధ
కందళ ములకును మూలకందము.
నవమాలిక : సఖీ ! నీవే దీని నంకురింపజేసితివి. “దీనిని వకుశమాలిక చేతి
కీయవల" డని నేను ముందే వంచించితిని కదా !
ప్రేమకళ : సఖీ, రాధికా! చపలత్వముచేత నది దాని నెటనో పారవైచి
యుండును. దాని నిప్పు డీ వటువు గైకొనినాడు. మరి యిప్పుడు
మనము దీనిని గ్రహించు టెట్లు?
రాధిక : నే నిప్పుడీ విషయమునే యోజించుచున్నాను. ఎట్లయినను సరియే
కాని యిది మాత్రము గోవిందకరా రవింద మరందముచే
నభిషికత్తము కారాదు.
నవమాలిక : అనుమానమేల? అట్లగుట నిశ్చయము.
రాధిక : ఫలితమును బట్టి నిర్ణయ మొనర్తము లెమ్ము.
రసాలకుడు: (ప్రవేశించి) శుభమగుగాక!
(చిత్ర ఫలకమును సమర్పించును)
అందఱును: (ఫలకమును జూచి)
చిరు చంద్రకళ వెటుల నెడబాటు నోర్చుకొని
తప్తచింతామణివిగా నిల్చితివి నీవు
మదన దారుణ తాపధాటి కెటొ మేమే చ
కోరముల భాతి చిత్తోద్వేగమున చోర
540
వావిలాల సోమయాజులు సాహిత్యం-2