చీ పటముతో వెలయు మాధవుడు, ప్రణయపతి
ప్రాణమును మించు మాధుర్యమని యనిపించు 16
సఖి : ఎక్కువయా? అందఱకు నెక్కువయే. అయినను కులాంగనలకు
నిందాపరుల పిశాచతాండవ జిహ్వను నివారించుట సముచితము
సుమా!
రాధిక : సఖీ! నవమాలికా! విషమసాయక బాణపాతము వలన గలిగిన
మర్మవ్యథ నీ వంటిదాని కేమి తెలియును అవసరమైన యెడ
ప్రేమకళ నడుగుము.
ప్రేమకళ: గురుభీతియు, జననిందయు
ముమ్మాటికి జేరనటుల
పతిభక్తికి రక్షసేయ
ప్రతినసేయవలయు గదా!
మరచితివే, ఓ సఖియా!
మానితివే మరి నీ వది!
విభుని లేత చిబుకమ్ముల
నూటలూరు మృదు పవనము
లూదెడు వంశీస్వనములు
ధీ పాటవ విశ్లధత్వ
మిడవచ్చును మందముగా 17
రాధిక : (వంశీనాద మాలించి ప్రేమావస్థ నభినయించును)
ప్రేమకళ: పులకలను నెడనెడను పొటమరించిన చెక్కి
ళుల నిగ్గుతోడి మధుశీత్కృతావళులతో
ముఖసరోజము కాగ ముగ్ధరుచికోశమ్ము
కుచకాంచనాద్రులను స్రవియింప ముచ్చెమట
మదనహేతి విఘాత భీతవై, సకియరో,
పలుమారు దీనముగ వణకెద విదేలనే? 18
రాధిక : (నీవీ సంయమము నభినయించును)
538
వావిలాల సోమయాజులు సాహిత్యం-2