ఏ తరిని కేశవుం డింపుగా వేణువును
మంద మృదు ధోరణుల నొంది యూదగ నెంచు
నపుడు పద్మాయతాక్షుల యాత్మలందు మద
నార్తిహేతువుగాగ నూర్చె వేడిమియూర్పు
లధరాళ మ్లానిమను నందముగ రూపించు
అంతేకాదు.
హర్ష యోగ్యమ్ము కేదారరాగమునందు
మధురముగ స్రవియించు మంజుమురళీ స్వనము
పద సరోజ స్వర్ణకటక నిర్వాణ మే
నియు నింత మోహనమ్ముగ జెలంగగ లేదు. 14
నవమాలిక: (పరీక్షగా జూచి శిరసు నించుక యూపుచు) తెరలో నుండి ఎవరో
రాధికా లోచనములను మూయుచున్నారు.
రాధిక. : (సీత్కారముతో)
ఓ రతి లంపట మానస,
ఓ మాధవ, ఇది యేమిటి?
కన్నుల చలియింప జేయు
కరతలముల దొలిగింపము
పరమభక్తి షట్పదమై
పాదపద్మ సేవికగా
ఓ మురారి! ఇదిగో నీ
రాధిక, ఇదిగో, యిట నున్నది. 15
సఖి : (రాధికాచిబుకమును పైకెత్తి) నీ సతీవ్రత మాహాత్మ్య మిదియేనా?
రాధిక. : (లజ్జచే మోము వంచి) సఖీ! భ్రమచే నిట్లంటిని.
సఖి. : సఖీ! కాదు, కాదు, విభ్రమముచే నంటి ననుము.
రాధిక. : పేశలము రమ్యమ్ము నాసికా భూషణమ్ము
కుండలమనోజ్ఞ మండితము గండస్థలము
నవనీలకుంతల వికుంచితము పింఛమ్ము
ముల్లోక మోహన తమాల నీలిమను, కాం
పీయూషలహరి
537