ఆ ప్రేమ సంయోగమైన నెద్దియు గాని
గాన గల్గెడు నట్టిదౌ ఫలమ్మది యేమి? 6
పారిపార్శ్వకుడు : అయినచో మన కిప్పుడింత భావబంధురమైన ప్రబంధమెయ్యది?
సూత్రధారుడు : ప్రణయకోపముగొన్న పడతి పల్కెడి రీతి
వింత వాక్కుల పగిది విన ముచ్చటలు గొలపు
ఉరముపైని పటాంతరమునందు క్రీడించు
నురుకుచంబుల రీతి నొప్పు కనుపండువుగ
అల గవాక్షమునుండి తిలకింప గనుపించు
నమృతాంశు సామ్యమౌ నతివవదన మ్మటుల. 7
పారిపార్శ్వకుడు : (పరీక్షణగా అంతటి కవి యెవరు?
సూత్రధారుడు : “పదునాలుగు భువనమ్ముల
పరుషాశ్మము కరిగించుట
కిరువురె కడు శక్తియుతులు
చతుర వచుడు జయదేవుడు
అమృతకరుడు శశిదేవుడు” 8
అని యనుటకు సమర్థుడు.
పారిపార్శ్వకుడు : (నేపథ్యమున కభిముఖుడై) అట్లయినచో గోష్ఠీనర్తనాభినయ
కోవిదులయిన కుశీలవులు సిద్దపడుడు.
(నేపథ్యమున) సఖీ! ఇటు, ఇటు!
సూత్రధారుడు : (వీక్షించి ఓహో! అభినేత్రులయిన యీ భరతులది యెంతటి
రసావేశము! రంగమంగళము వీణాశూన్యముగానే
ప్రారంభించినదే!
చంద్రకళాకాంతి కరణి
తా శంకావహ యౌగద
ఈ పంకజముఖి వచ్చిన
నింకొక సఖి యామె ప్రక్క
8. దీనికి డా.ఎక్కిరాల కృష్ణమాచార్యుల పద్యానువాదము పీఠిక - 14వ పేజీలో కలదు.
పీయూషలహరి
535