కావలసిందేముందని 'సరే' నన్నాను. మూలప్రతులూ, అనువాదమూ, భారతిలో ముద్రితమైన పీఠికా రూప వ్యాసమూ అందచేశాను.
కాని డా. నరసింహారావుగారితో ఒక్కమాట అనక తప్పలేదు. 'నేను పీయూషలహరి తెలుగుచేసి దాదాపు నలభైయేళ్ళయింది ఇప్పుడు నాకు డెబ్బై యేళ్ళు దాటాయి. అనువాదంలోని ఔచిత్యాలనూ, పాఠ పరి పరిష్కారాలను సరిచూడవలసిన అవసరం వుంది. ప్రస్తుతం నాకు వాటిని సరిచూచే ఓపిక లేదు. కాని మీరున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం డైరెక్టరుగా చిరకాలం బహుభాషా గ్రంథాల పరిష్కరణ ప్రచురణ బాధ్యత వహించి, పండిన అనుభవంగలవారు. ఈ పీయూషలహరికి కూడా పాఠ పరిష్కారాది సంపాద కత్వ బాధ్యతలు మీరే వహించటం సబబుగా వుంటుంది. తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ విభాగం అధికారిగా ఇది మీ విధికూడా కావచ్చునేమో!' అన్నాను.
అవును వారు తమ విధిని యథావిధిగా నిర్వర్తించారు.
దాని ఫలితమే ఈ పీయూషలహరి పరిష్కృతప్రతి.
మూలానువాదాలు రెండింటినీ ప్రచురణకు అనుమతించిన తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుల ఉదాత్త సంకల్పానికీ, ఉదారాశయానికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
(సం) శ్రీ వావిలాల సోమయాజులు
530
వావిలాల సోమయాజులు సాహిత్యం-2