పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/529

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భక్తి జ్యోతిని అందుకొని వంగవైష్ణవ ప్రపంచాన్ని ఉద్యోతితం చేశాడు. అందువల్ల వంగవైష్ణవానికి ప్రథమ ప్రవక్త జయదేవుడే అని నిరూపితమౌతున్నది.[1]

అట్టి వైష్ణవభక్తికి 'పీయూషలహరీ' 'గీతగోవింద'ములు ప్రాణ ప్రవాహికలుగా చెప్పగదినవి.

కృతజ్ఞత

శ్రీ జయదేవకవి విరచిత 'పీయూషలహరి' మూలప్రతి నా కంటబడి నాలుగు దశాబ్దాలు గడిచాయి. కంటబడిందే తడవుగా దీన్ని గూర్చి భారతిలో (వికృతి - మాఘం) ఒక సుదీర్ఘ వ్యాసం వ్రాశాను. అనేక రసజ్ఞుల అభినందన లందాయి.

ఇది మహాకవి జయదేవుని రచన. ఆంధ్రులకు ఇష్టమైన అష్టపదులుగల గీతగోవిందానికి పూర్వరంగమైన గోష్ఠీరూపకం - పీయూషలహరి. తెనుగు చేసిందాకా కునుకు పట్టలేదు తెనుగు చేశాను - ఆనందంలో ఆవేశంలో.

ఆంధ్రులకు ఆవేశమున్నంతగా ఆలోచన ఉండదని ఒక అపప్రథ ఆలోచన వుండివుంటే అప్పుడే ఈ అనువాదాన్ని అచ్చువేసి, అందరి అందు బాటులోకి తెచ్చివుండేవాణ్ణి తేలేదు. అదీ ఒకందుకు మంచిదే అయింది.

నా దగ్గర ఈ అనువాదమూ, దీనికి మూలమూ ఉన్నాయని పసిగట్టిన మిత్రులు - సత్కవి - శ్రీ ఊట్ల కొండయ్యగారు. వారిని వెంటబెట్టుకొని, ఉభయ కవిమిత్రులు డా. వి. వి. యల్ నరసింహారావుగారు 18-6-1989న, నా దగ్గరకు వచ్చి తెలుగు

విశ్వవిద్యాలయం ప్రచురణగా దీన్ని ముద్రించుకొనేందుకు అనుమతికోరారు. అంతకంటే

  1. ఈ అభిప్రాయాన్నే సుకుమార సేన్ మహాశయుడు తన ప్రజబోలీ సాహిత్య చరిత్రలో ఈ రీతిగా పలికినాడు. This outlook of PREMA which we find systematised already in Bhagavata Purana but which does not seem to have affected popular conception of Krishnaism in Bengal up to the 15th Century A.D. We first come across in Bengal in the life of Mahendra Puri, who was the Guru of Advaitacharaya Isvara Puri and other contemporaries of Chaitany Deva. Isvara Puri was the Guru of Chaitanya Deva, so the Spirit of Mahendri passed unto Chaitanya Deva, to be developed into a wonder of the world" - History of Braja Boli lite rature. P.12

పీయూషలహరి

529