పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/528

ఈ పుటను అచ్చుదిద్దలేదు

భాగవత పురాణాన్ని అనుసరించింది కాదు. భాగవత రాసలీల శరత్తులో జరుగుతుంది. జయదేవునికి మూలం బ్రహ్మవైవర్తము. అందులో రాసోత్సవాన్ని గురించి కృష్ణ జన్మ ఖండంలో ఇలా ఉంది. “రాసోత్సవం మహద్రమ్యం సర్వేషాం హర్షవర్ధనమ్, పూర్ణచంద్రోదయే సక్తం వసంతే రాసమండలే..... ఏకదా శ్రీహరిర్నక వనం బృందావనం యయో, శుభేశుక్ల త్రయోదశ్యాం పూర్ణ చంద్రోదయే మమౌ.... యూధికా మాధవీ కుంద మాలతీ పుష్పవాయునా, వాసితం కలనాదేన మధుపానం మనోహరమ్". ఈ రాసలీల మూడు దినాలు మాత్రమే. భాగవత రాసలీల వంచశరద్రాత్రులు. జయదేవుని తరువాత జన్మించిన అనేక వైష్ణవ కవులు కూడా ఈ బ్రహ్మవైవర్తరాసమే అనుసరించారు. జయదేవుని గీతగోవిందమూ, పీయూషలహరి అర్థం కావటానికి ఒరిస్సా వైష్ణవాన్ని గురించిన విజ్ఞానం కొంత అవసరము. కళింగదేశంలో క్రీ.శ. 8 శతాబ్దములో ప్రవేశించిన మహాయాన బౌద్ధం క్రమంగా వజ్రయాన, సహజయానాలుగా రూపొందింది. క్రీ.శ. 729 నాటి ఒరియారాజు ఇంద్రభూతి, చెల్లెలు లక్ష్మింకర వల్ల సహజయానం ఆదేశంలో ప్రవేశించిదని ప్రతీతి. ఇంద్రభూతి జ్ఞానసిద్ధిలో జగన్నాథుని బుద్ధదేవునిగా స్తుతించాడు. సహజయానాన్ని ప్రచారం చేసినవారు కౌపవాదులు ఓడ్రదేశీయులు. వజ్రయాన సహజయాన వైష్ణవాలు కలిసి ఓడ్రదేశంలో నూతన వైష్ణవానికి దారితీసి ఉంటవి. దానికి ముఖ్యమైన ప్రవక్తలు-జయదేవుడు, రామానంద రాయలు. సహజయాన పంథేయులు జయదేవుణ్ణి ప్రథమ ప్రవక్త గానూ, నవరసికుల్లో ఒకడిని గానూ పరిగణిస్తారు. క్రీ.శ 15, 16, 17 శతాబ్దాలలో ఓడ్ర రచయితలు సరళదాసు, బలరామదాసు, అచ్యుతానందులు, పీతాంబరుడూ మొదలైన కవులు సహజయానాన్ని అనేక గీతాలలో ప్రశంసించారు. రామానుజ మధ్వాచార్యు లిరువురూ పూరీ జగన్నాథానికి వెళ్ళి వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేశారు. తరువాతి వాడైన జయదేవుడు వారి ప్రభావం వల్లనూ, అనాదినుంచీ వస్తూ ఇంద్రభూతి చెల్లెలు తెచ్చి పెట్టిన సహజయాన బౌద్ధ ప్రభావం వల్లనూ నూతన రాధాతత్వాన్ని సాధించి ప్రబోధించినాడు. దానిని స్వీకరించి క్రమంగా అద్వైతాచార్య, ఈశ్వర పూరీలకు గురువైన మహేంద్రపురి వంగదేశంలో ప్రవేశపెట్టినాడు. ఆయన శిష్యుడైన ఈశ్వరపూరీకి చైతన్యమహాప్రభువు శిష్యుడు. చైతన్య ప్రభువు జయదేవుని 528 వావిలాల సోమయాజులు సాహిత్యం-2