పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/527

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బట్టి జయదేవకవి ఈ రెండు రచనలను పురస్కరించుకొని రాసలీలా స్వరూపాన్ని పూర్ణంగా ప్రదర్శించినాడని ఊహింపవచ్చును.

కవి స్వోత్కర్షగా చెప్పుకున్న గీతగోవిందంలో 'సాధ్వీ మాధ్వీక! చింతా నభవతిభవతః' ఇత్యాదులను పోలిన శ్లోకాలు పీయూషలహరిలోనూ కనిపిస్తున్నవి. అందుకొక ఉదాహరణ :


"ఆశ్మద్రవీకర్తు మిమౌ సమర్థౌ, చతుర్దిశా నామపి పిష్టపానామ్
అహం వచోభి ర్జయదేవ నామా, కరచ్ఛటాభిశ్చ తుషారధామా”
“పరుషాశ్మము గరగించుట, కిరువురకే యనువు గలుగు హృద్యవచో వి
స్ఫురణను నే జయదేవుడ, కరముల చలువను దుషారకరు డొక్కరుడున్"[1]


కృష్ణ భక్యైకతాను డైన జయదేవకవి పీయూష లహరీ ప్రారంభంలో నటరాజు నుద్దేశించి క్రింది నాందీ మంగళశ్లోకాన్ని చెప్పటం గమనింప దగ్గ విషయం.


"కింజల్క ద్యుతిపుంజ పింజర దళ త్పంకేరుహ శ్రీవహమ్
శంపా సంపతి తాంశు మాంసల శరత్కాందబినీ డంబరమ్
లాస్యోల్లాసిత చండ తాండవ కళా లీలాయితం సంతతమ్
చక్రప్రక్రమ వృత్త నృత్త హరయో నిర్వ్యాజ మవ్యాత్ జగత్"

"పరితః కేసర పుంజ పింజర దళ త్పంకేరుహాకారమై
దర శంపా రుచిరాంశు మాంసల శరత్కాదంబినీ డంబర
స్ఫురణన్ పర్వత కన్యకా మధు నట త్ఫుల్లాస్య లాస్యాంచితం
బరుదౌ శంకర చండ తాండవము నిర్వ్యాజమ్ము మిమ్మోముతన్ ".[2]


'కోమలకాంత' పదావళులతో, కైశికీ వృత్త్యుపేతమై, లాస్యోచితమై పీయూషలహరి ప్రాచీన గోష్ఠీ ప్రబంధానికి ఒక ప్రముఖ లక్ష్యంగా ఒప్పుతున్నదనటం నిస్సంశయము.

వైష్ణవం

జగన్నాథస్వామి ఆలయంలో పీయూషలహరిని వసంతంలో రూపించినారు.

జయదేవుడు గీత గోవిందంలోనూ, పీయూషలహరిలోనూ నిరూపించిన 'రాసలీల'
  1. డా. ఎక్కిరాల కృష్ణమాచార్యులు అనువాదము
  2. డా. ఎక్కిరాల కృష్ణమాచార్యులు అనువాదము

పీయూషలహరి

527