పీయూషలహరి : జయదేవుడు
జయదేవకవి కృతమైన 'పీయూషలహరి' నూతనంగా లభించింది[1] ఇది ఒక గోష్ఠీ ప్రబంధము. సాహిత్య దర్పణంలో చెప్పిఉన్న ఈ గోష్ఠీ లక్షణాలల్లో కొన్ని మాత్రమే పీయూష లహరికి పట్టినవి.
"ప్రాకృతైర్నవభిః పుంభి ర్దశభిర్వాప్యలంకృతా
నోదాత్త వచనా గోష్ఠీ కైశికీ వృత్తి శాలినీ
హీనగర్భ విమర్శాభ్యాం పంచషట్యోషి దన్వితా
కామ శృంగార సంయుక్తా స్యా దేకాంక వినిర్మితా-
సా.ద-షష్ఠ పరిచ్ఛేదం.
'గోష్ఠిలో 9 లేక 10 మంది ప్రాకృత పురుషులు 5 లేక 6 గురు స్త్రీలు ఉంటారు.
అంకం ఒకటే. గర్భ విమర్శ సంధులుండవు. ఉదాత్త వచనం ఉండదు. వృత్తి కైశికి,
కామశృంగార ప్రధానం, 'పీయూషలహరి' ఇంతకంటే విశిష్టం. గుణోత్తరం.
ప్రాచీనకాలంలో జగన్నాథస్వామి ఆలయంలో అనేకములైన ఏకాంక నాటికలను ప్రదర్శించేవారు. పీయూషలహరిని కూడా అటువంటి నాటక సమాజంతో కలిసి జయదేవుడు ప్రదర్శించినట్లు పీయూషలహరిలోని "గోష్ఠీ శ్రీ జయదేవ పండితమణేః సావర్తతే సర్తితుమ్” అన్న వాక్యం వల్ల వ్యక్తమౌతున్నది. ఇటువంటి నాటక సమాజాలు నేడు కూడా అచ్యుతానంద సంప్రదాయులైన వైష్ణవుల్లో కనిపిస్తున్నవి. వీరు రాధను ప్రధాన నాయికగా గ్రహించి జగన్నాథ స్వామి ముందు రాసక్రీడలు సలుపుతుంటారు.
పీయూషలహరికి కథావస్తువు గీతగోవింద కథావస్తువే. రాధ ప్రధాన నాయికగా శ్రీకృష్ణుడు రాసలీల నడపటము కథాంశము. అందువల్ల పీయూషలహరిని
గీతగోవిందానికి భూమికగా శ్రీకార్ మహాశయుడు అభిప్రాయపడినాడు.[2] దీనిని- ↑ సంస్కృత వ్యాఖ్యానముతోను, ఆంగ్లాను వాదముతోను దీనిని శ్రీ కరుణాకర కార్ మహాశయుడు కళింగ చారిత్రక పరిశోధక మండలివారి పత్రికలో సంపాదించి ప్రకటించినారు. సం1. సంచిక 4 మార్చి 1947)
- ↑ "The real sportive dance of Krishna (Rasa lila) with Radha at the head of the Gopis is fully shown in Gita-Govinda. This fully confirms that Piyusha Lahari is first and Gita-Govinda is the second part of Rasa lila. Piyusha Lahari is a supplement to Gita-Govinda"
526
వావిలాల సోమయాజులు సాహిత్యం-2