పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/523

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనిపించుకోక పోవచ్చును. అయినా ఇది రసవత్తర మహాకావ్యమని అనటానికి ఎటువంటి సందేహమూ లేదు.


"యద్గాంధర్వ కళాసు కౌశల మనుధ్యాయంచ యద్వైష్ణవం
యచ్ఛృంగార వివేక తత్వరచనా కావ్యేషు లీలాయితమ్
తత్సర్వం జయదేవ పండిత కవేః కృష్ణైకతానాత్మనః
సానందాః పరిశోధయంతు సుధియః శ్రీ గీతగోవిందతః"


అన్న వాక్యాలలో కవి రాధాకృష్ణుల అన్యోన్య ప్రేమను గానం చేసి అందలి పరమ శృంగార భావంలో విలీనులై కేవలులు కావలసిందని రసికలోకాన్ని హెచ్చరించాడు. నవ విధభక్తి మార్గాలలో 1) పితాపుత్ర 2) రక్ష్య రక్షక 3) ఆధారాధేయ 4) శరీరాత్మ 5) జ్ఞాతజ్ఞేయ 6) భోక్తృభోగ్య 7) స్వస్వామి 8) భార్యభర్తృ 9) శేషశేషి అష్టమమైన భార్యా భర్తృ భక్తి మార్గం గీతగోవిందంలో నిరూపిత మౌటంవల్ల దీనికి అష్టపది అనే నామం అబ్బి ఉంటుందా?

నేడు గీతగోవిందం జగద్విఖ్యాతి పొందిన మహాగ్రంథం. ఇది బహుకాలం క్రిందనే పాశ్చాత్య దృష్టి నాకర్షించింది. దీనిని సర్ విలియం జోన్సు, ఎడ్విన్ ఆర్నాల్డు మహాశయులు ఆంగ్లభాషలోనికీ, లాసన్ లాటిన్ భాషలోనికీ, రూకెట్ జర్మన్ భాషలోనికీ అనువదించారు. ఉత్కలరాజు గీత గోవిందాన్ని అనుకరించి అభినవ గీతాగోవిందాన్ని రచించినాడు.[1] 'సంస్కృత భాషలో గీతగోవింద ప్రభావం వల్ల అనేక 'హర-గౌరులు' 'రామ-సీత'లు జన్మించినవి. అటువంటి వానిలో క్రీ. శ. 15.16 శతాబ్దుల నాటి రాయ రామానందుని జగన్నాథ వల్లభ నాటకము, కృష్ణలీలామృతము (కర్త వనమాలి, అముద్రితము – 15వ శతాబ్దము). క్రీ.శ.17వ శతాబ్ది నాటి యతీంద్ర రఘునాథసూరి ముకుంద విలాసము (అముద్రితము) ముఖ్యమైనవి. ఒరియాభాషలో పిండిక

శ్రీచందనుని (క్రీ. శ. 17వ శతాబ్దము) సంవత్సరము, దిన కృష్ణ దాసు (క్రీ. శ. 17వ
  1. ఈ అభినవ గీతగోవింద ప్రతులు నేటికీ ఉత్కలదేశంలో దొరుకుతూవున్నవి. జగన్నాథ స్వామి ఆలయంలో తిరిగి ఈ గీత గోవిందాన్ని ప్రవేశ పెడతారేమో ననే భయంతో నరసింహ, కపిలేంద్ర ప్రతాపరుద్రదేవులు "కేవలము గీతగోవిందాన్ని మాత్రమే జగన్నాథ స్వామి వినవలె నని శాసించినట్లు శాసన ప్రమాణములు కనిపిస్తున్నవట- Vaishnavism in Orissa పే 43.

పీయూషలహరి

523