నూతనములు. జయదేవ కవికిని లక్ష్మణసేనునికి నెట్టి సంబంధమును వారి నిర్ణయమున పొడకట్టదు.
క్రీ. శ. 16వ శతాబ్ధంలో ఉన్న కేశవ మిశ్రుడు తన అలంకార శేఖరంలో
"ప్రాక్ ప్రత్యక్ పృథివీభృతో: షరిషది ప్రఖ్యాత సంఖ్యావతాం
మహనీ యాద్భుత తర్క కర్కశతయా విచ్ఛిద్య విద్యామదమ్
యేకేప్యుత్కలు భూపతే తవ సభా సంభావితాః పండితాః
పత్రం శ్రీజయదేవ పండిత కవి స్తన్మూర్థ్ని విన్యస్యతి
అని చెప్పినాడు. మహారాష్ట్ర భాషలో ఉన్న కవి చరిత్రలో క్రీ. శ.14వ శతాబ్దానికి
పూర్వము పురుషోత్తమదేవుడు కళింగదేశాన్ని కటకం రాజధానిగా పాలించి, ప్రజా
హితాన్ని కోరి, త్రికాండ శేషహారావళి ఏకాక్షర కోశమూ వ్రాసినట్లు ఉన్నది.
జగన్నాథస్వామి ఆలయంలోని తాళపత్ర లేఖనాలు (మద్లపంజి) కామార్ణవుడు అనే
(క్రీ. శ. 1142-1156) ఉత్కలరాజు నిత్యమూ గీతగోవిందాన్ని వినకుండా భోజనం
చేసేవాడు కాడని ఉంది. ఈ కామార్ణవుడు జయదేవుని శిష్యుడూ, సమకాలికుడూ,
జయదేవుని గీతగోవిందాన్ని నిత్యమూ జగన్నాథాలయంలో చదవటానికి
ఆజ్ఞాపించినవాడు. క్రీ. శ.1180-1190 మధ్యన రాజ్యపాలనం చేసిన రెండవ
రాజరాజుకు పురుషోత్తమ దేవుడనే నామం ఉన్నట్లుపై లేఖనాలవల్ల తెలుస్తున్నది.
అభినవ గీతగోవింద రచనజేసి ఈరాజు జయదేవ గీతగోవిందానికి బదులుగా తన
కావ్యాన్ని జగన్నాథస్వామికి వినిపించవలెనని ఆజ్ఞాపించినాడనీ, అందువల్ల ఆనాటి
ఉత్కల వైష్ణవలోకం పట్టుపట్టటంవల్ల తిరిగి రాజు జగన్నాథస్వామి కోరిక కారణంగా
సంధికి వచ్చి మరల గీతగోవింద పఠనాన్నే ఆదేశించి, గీతగోవిందంలో ప్రతిసర్గాంతము
లోనూ తన అభినవగీతగోవిందంలోని శ్లోకం ఒకటిఉండేటట్లు చేసుకున్నాడనీ
- ↑ మహాపతి భక్త విజయంలో సాత్యకి పరంగా కల్పించిన కథకు ఆధారం లేక పోదన్న మాట. గీతగోవిందాన్ని తీసి భక్తులను తన గోవిందకావ్యాన్ని చదవమని నిర్బంధించిన పురుషోత్తమదేవుని వల్లనే అటువంటి అంశం భక్తవిజయంలో ప్రవేశించి ఉంటుంది. అభినవ గీత గోవింద శ్లోకం ఒకటి గీతగోవిందంలో ప్రతి సర్గాంతంలోనూ చేర్చి చదివినారనటం కూడా అభూత కల్పన ఐఉండదు. నిర్ణయసాగర ముద్రాక్షర శాలవారి గీతగోవింద కావ్యం చివరన ద్వాదశసర్గంలో కనిపిస్తున్న.
పీయూషలహరి
521