పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/514

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రస్తుత ప్రచురణ 'పీయూషలహరి' అపురూపమైన కృతి. అత్యంత ప్రజాదరణ పొందిన గీతగోవింద కావ్యకర్త జయదేవకవి రచించిన 'గోష్ఠీ రూపకం' ఇది. గీత గోవిందానికి పీయూష లహరి పూర్వరంగం వంటిదనవచ్చు. రెండింటిలోనూ శ్రీకృష్ణుని రాసలీలలు ఇతి వృత్తాలు. ఈ గోష్ఠీరూపకాన్ని ప్రసిద్ధ సాహితవేత్తలు శ్రీ వావిలాల సోమయాజులుగారు సేకరించి అనువదించి ప్రచురణకోసం తెలుగు విశ్వవిద్యాలయానికి అందించారు. వారి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, వారికి కృతజ్ఞతలు అందచేస్తున్నాను.

'పీయూషలహరి'పై పండిత కె.కార్ సంస్కృతంలో వ్యాఖ్యానం రాశారు. ఈ వ్యాఖ్యానం, ఇంగ్లీషులో పీఠికతోపాటు నాగరలిపిలో సంస్కృత మూలపాఠాన్ని ప్రత్యేక ప్రచురణగా విశ్వ విద్యాలయం పాఠకలోకానికి అందిస్తోంది.

ఉత్తమ గ్రంథాలను అందించాలనే తెలుగు విశ్వవిద్యాలయం సంకల్పానికి ఈ గ్రంథం ఒక నిదర్శనం. ఇది తెలుగు పాఠకుల అభిమానాన్ని చూరగొంటుందని విశ్వసిస్తున్నాను.


హైదరాబాదు -4

ఆచార్య సి. నారాయణరెడ్డి

తేది : 22-2-1990

ఉపాధ్యక్షులు

తెలుగు విశ్వవిద్యాలయం


514

వావిలాల సోమయాజులు సాహిత్యం-2