బుధాదేవి : (పట్టిక చేతిలో గ్రహించి) మనము మొదట వర్తక శేష్ఠులతో పరీక్ష ప్రారంభిద్దాము.
అమాత్యుడు : వీరెల్ల నా 'ప్రత్యేక సభ'లో నున్న రాజపుత్రులేనని సంతోషపూర్వకముగా మనవి చేయుచున్నాను.
బుధాదేవి : రాజగణకు డెంతమంది పరీక్షింపబడ్డారో మనవి చేయగోరుతున్నాను.
గణకుడు : ఇంతవరకొక్కరుడైన పరీక్షింపబడలేదని నేను మహారాజ్ఞికి సవినయంగా మనవి చేయుచున్నాను.
బుధాదేవి : ఎందువల్ల?
గణకుడు : అమాత్యుల వారింతవరకూ 'సంతుష్ట” శబ్దమున కర్ధనిర్ణయమొనర్చుట పూర్తిగావింపనందున నింతవరకెవ్వరిని పరీక్షించుట కవకాశము దొరకక నేను సవినయముగా మనవి చేయుచున్నాను.
బుధాదేవి : ఈ అర్థనిర్ణయ విషయంలో ఎన్ని మతభేదాలేర్పడ్డవో చెప్పగలవా?
గణకుడు : ఇంతవరకా శబ్దార్థ నిర్ణయమును గూర్చి కలిగిన మతభేదములు పంచాశత్తు (పొరబడి) నూన పంచాశత్తు - నిన్నటి సాయంత్రమున శబ్దార్థ నిర్ణయయుగములో నొకడు మరణించెనని స్థానమునకు వార్త వచ్చినది.
బుధాదేవి : ఆ పోనీ. అర్థ నిర్ణయం జరిగిన తరువాత అట్టి సంతుష్ట స్వాంతుడెక్కడ చిక్కుతాడని?
(మరొక వర్తకుడు ప్రవేశము)
బుధాదేవి : నీవు నవద్వీపాలతో వ్యాపారం చేస్తున్నావు కదూ.
శ్రేష్ఠి : యాడిదీ తొమ్మిది దీపాలతోనేగా... మా బుచ్చిచెట్టి పదకొండు దీపాలతో వర్తకం -
మరొక శ్రేష్ఠి : ఎంత యాపారం ఏడిస్తే ఏం - పిల్లలో పిల్లలు -
మరొక శ్రేష్ఠి : అజీర్ణం. కడుపుకు తిని సచ్చిందాడుంది. అరుగుద్దా - ఎప్పుడూ సబ్బుల్లిపాయ. పచ్చిపుల్సు ఇంతేగా - తిండో తిండి.
494
వావిలాల సోమయాజులు సాహిత్యం-2