ఈ పుట ఆమోదించబడ్డది
జిజియా: నాయనా శివా! శత్రువును సంహరించి నాకు మహా సంతోషాన్ని కల్పించావు. నీ పోరాటం సర్వం చూస్తున్నాను. ఇవే నా ఆశీస్సులు. భావి భారత సామ్రాట్టువి నాయనా!
శివాజీ: అమ్మ నీ ఆశీర్వాదబలం అమ్మ భవానీదేవి కృప వుంటే తప్పక భారత సామ్రాట్టు నౌతాను. జై భవానీ మాతకి జై, జై జిజియా బాయికి జై.
(సైనికులు జై భవానీ మాతకి జై, జిజియా బాయికి జై అని ప్రతిధ్వనిస్తారు)
ఎ.ఐ.ఆర్. విజయవాడ 28-11-1958
464
వావిలాల సోమయాజులు సాహిత్యం-2