మోసగించని ప్రేమ లభిస్తుంది. నాగరిక లోక వాసనే లేని ఆ ప్రపంచం ఎంత మధురమైనదమ్మా! దివ్య సుమగంధాలతో వాసించే ఆ కళ్యాణభవనాలను ఒక్కమాటు ఈ రాజభవనాలతో పోల్చి చూచుకో- గుండె చెరువైపోవటం లేదూ! కజ్జల : ఎంత అమాయకురాలివి తల్లీ. నీవన్నీ వట్టి పిచ్చికలలు. వెర్రిదానా! నీ ప్రేమ సత్యం. నీ కన్నీరు సత్యం. నీ కలలు అసత్యాలు, నీ ఆదర్శాలు అసత్యాలు - కానీ నీ సరస హృదయం నన్నొక రసస్రవంతిని చేస్తున్నది. ఒక్కమాటు నాదగ్గిరకి ఇలా రా తల్లీ! నిన్ను మనసార ఈనాడైనా ఈ పాపిని ప్రేమించు నీ - (స్పృశిస్తూ) నీ సర్వాంగాలు శతపత్ర కోమలాలు తల్లీ! ఈ ముదివగ్గు కన్నీటిని వాటిమీద హిమ బిందువులుగా వెలువనీ - నాకిప్పుడు నీవంటే ఈర్ష్య చచ్చిపోతున్నది - ఈ భిన్న హృదయానికి ఎన్నాళ్ళకు నీదగ్గిర ప్రశాంతి దొరికింది సారంగీ! చింతాజడం కాబోకు. కిలకిలా నాతోబాటు నవ్వుతూ ఉండు. ఇతరులను నవ్వించు. ఆనందించు. నీలో ప్రతిబింబిస్తూ ఉన్న నా యౌవనరూపాన్ని చూచి ఆనందిస్తూ కాలం వెళ్ళబుచ్చుతాను తల్లీ! సారంగదేవి : నా కోరికను అనుసరిస్తావా? కజ్జల : రేపే బయలుదేరుదాము. సారంగదేవి : (పట్టరాని సంతోషంతో) అమ్మా! కజ్జల : (ప్రగాఢంగా) తల్లీ! (ఇద్దరూ ఒక కౌగిలిలో ఒదిగిపోతారు) (బయట కలకలం 'పట్టుకొండి' 'తన్నండి') సారంగదేవి : ఏమిటది? కజ్జల : అమ్మాయీ! నీవు త్వరగా ఇక్కడనుంచి వెళ్ళిపో. సారంగదేవి : (కదలదు) కజ్జల : ఊఁ త్వరగా సారంగదేవి : నీవో! కజ్జల : నాకేమీ భయం లేదు. నేను ఒంటరిగా ఉండగలను. కంచుకి : (వణికిపోతూ ప్రవేశించి) సంగతి బయటపడ్డది తల్లీ! 400 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/400
ఈ పుటను అచ్చుదిద్దలేదు