పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/396

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అది మహాపాపం!! జన్మతః కొందరు ప్రాభవం సంపాదించ కుండానే అసహ్యించుకొని, నేను విశ్వప్రయత్నం చేసి విజయం పొంది అనేకమంది వ్యక్తులను పాలించాను. సాధనలో నాకు ప్రతి మెట్టునా ప్రత్యర్థులే! నాతో ఏ కోశానా సాటిరాలేని ప్రతిభా శూన్యులే నాకు ప్రత్యర్థులు!! నా సేవకురాలు గాయనే నాకొక ప్రత్యర్థురాలు. నా మహోన్నత పదవిని ఊపిరి ఉండగానే దానికి కరస్థం చేసి నేను ఎలా జీవించ గలుగుతాను, దక్కించుకొని తీరవలసినదే. సారంగదేవి : (దీనంగా) నీ వనుసరిస్తూ ఉన్న మార్గాలు నిన్ను ఏ లోకాలకు నడిపిస్తున్నవో గుర్తిస్తున్నావా? కజ్జల : అదంతా మరొక జన్మం మాట! మరొక లోకం మాట!! ఈ జన్మలోనే అపజయం పొందుతూ ఉన్నప్పుడు ఎప్పటి మాటో నాకెందుకు? ఈ అపజయాన్ని భరించలేను - ఇక మృత్యువు మాటా? అది నాకు ఎంతో దూరాన ఉంది. దాన్ని గురించి ఇప్పుడు నేను ఆలోచించవలసిన ఆగత్యమే లేదు. సారంగదేవి : ఆ వేయి కళ్ళ తల్లి ఎప్పుడూ మనను వెన్నాడే ఉంటుంది. కాలం గడిచి పోతున్నది. వయస్సు ముదిరి పోతున్నది. ఇంకా మృత్యువు ఎంతో దూరాన ఉన్నదని ఎందుకు భ్రమపడతావు తల్లీ! కజ్జల : (తన శరీరాన్ని ఒక్కమాటు కలయ చూచుకుంటూ) వృద్ధాప్యము! మానవ లోకానికి ఎంత దారుణమైన శిక్ష! నరకము లేదు. ధైర్య స్థైర్యాలు లేని దద్దమ్మల సృష్టి అసహజము అసత్యము! కానీ యౌవన సౌందర్యానికి ఇన్నాళ్ళు మురిసిపోయిన యీ కళ్ళు సడలిపోతూ ఉన్న ఈ శరీరాన్ని ముందు ఎలా చూచి భరించగలుగుతవో! ఒకప్పుడు అలంకారం చేసుకున్న నన్ను నేనే అద్దంలో చూచికొని మురిసి పొయ్యేదాన్ని - నేనే పురుషుడనై నా యౌవనాన్ని అనుభవిస్తే ఎంత ఆనందముంటుందోనని ఊహించేదాన్ని. అటువంటి యౌవ్వనం ఏమైపోతున్నట్లు? ఎక్కడికి పోతున్నట్లు!! సౌందర్యం ముదిమి చేతుల్లో ఏనాటి కైనా ముక్కి పోవలసిందేనా? తప్పదా- తప్పదు. జరామరణ భయాలు ప్రాణికి సహజం తప్పదు. ప్రప్రథమంలో పలితకేశాన్ని చూచినప్పుడు నా పంచప్రాణాలు పోయి నట్లైంది. అయినా ఈ ముసలితనం ఏం జేయగలుగుతుందో చూస్తాను. దాన్నీ జయించటానికి ప్రయత్నం చేస్తాను. సారంగదేవి : అమ్మా! ఎంత వెర్రిన పడుతున్నావు. జర మానవలోకానికి కా సమస్త ప్రాణి లోకానికీ సహజధర్మం. దానిమీద విప్లవం చెయ్యలేము. 396 వావిలాల సోమయాజులు సాహిత్యం-2