పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/395

ఈ పుటను అచ్చుదిద్దలేదు

హస్తాలకు లొంగిపోయింది ఈ దేహం. ఆ కుహనా గురువు కరకు చూపులకు గురై పోయింది. ఈ దేహం... అబ్బా! బాధ - ఉం. సారంగదేవి : అమ్మా! నీవీ పని ఎలా చేయగలిగావు కజ్జల : తల్లీ! నాకిప్పుడు అర్థం కావటం లేదు. నేనేం చేశానో నాకు తెలియటం లేదు. అమ్మా! నేనిప్పుడెక్కడున్నాను. నా సౌధంలోనేనా... అమ్మాయీ ఇప్పుడిక్కడి కెందుకు వచ్చాను. మతి భ్రమిస్తున్నది. నేను పిచ్చిదాన్నై పోతున్నాను. సారంగదేవి : అమ్మా! నీవు సంపాదించిన సౌఖ్యం, ఇదేనా? - కజ్జల : సౌఖ్యం! శక్తి!! జగత్తులో ఈ రెంటికే స్థానము లేదు. పాలనా కాంక్షలో సౌఖ్యం ఎక్కడుంది తల్లీ! అయినా పాలించలేనిది బ్రతకలేం. - ఇదంతా నీకు అర్థం కాదు. ఎందుకు పాలించాలో నీవు అవగతం చేసుకోలేవు. భిక్షుకుల మధ్య బ్రతక వచ్చు. కానీ ప్రభువులూ, పశువుల సాంగత్యంలో ప్రాణాలు నిలుపుకోలేము. మన కులం మానవ సౌఖ్యమనే కసాయి కత్తులకు కంఠాలర్పించే కంచి మేకలం. జనసామాన్య జీవితంలో శాంతి సౌఖ్యాలు దొరకవని భ్రాంతి పడ్డాను. ప్రభుసౌధ పర్వతాగ్రమెక్కి పదిహేనేండ్లు పరిపాలించాను. ఈనాటికి, ఈ వయస్సున నాకు పతనం! భరించలేను. మళ్ళీ సామాన్య జనసాంగత్యం! అబ్బా బాధ భరించలేను. సారంగదేవి : సామాన్య జనజీవిత మెంత సౌఖ్య ప్రదమయిందో నీవు గుర్తించలేదు తల్లీ. వారి ఆనందం మనకు అనంత లోకాలు వెదికినా దొరకదు. కజ్జల : కాదు! కాదు పొరబాటు!! అమ్మాయీ! వాళ్ళు పాలింపబడటానికి పుట్టారు. నేను పాలించటానికి జన్మించాను. సారంగదేవి : నీవు పాలించటానికి ఎవరవని తల్లీ! లోకంలో ఒకరిని ఒకరు పాలించలేరు. పాలిస్తున్నామని భ్రమపడతారు. కాని - పాలించేది పరమ శివుడొక్కడే. కజ్జల : తల్లీ! జనసామాన్యం కెంధూళి. నాబోటి ఉత్తమ జన్మలు తారాపథ మంటేటట్లు దాన్ని తరిమివేసే జంఝూమారుతాలు. సారంగదేవి : అమ్మా! పాలనాకాంక్ష ఆత్మను పతితం చేస్తుంది. కజ్జల : అది వట్టి భ్రమ. పతితం చేయదు. పవిత్రం చేస్తుంది. మలినం చేసేది మనస్సులుగాని మరేమీ కాదు. పాలకులతో భ్రమపడి సంధి చేసుకుంటే ఆత్మ పతితమౌతుంది. లోకంలో ఉన్నదల్లా ఒకటే పాపం! ఆత్మను గుర్తించలేకపోవటం. ఏకాంకికలు 395