కజ్జల : నీ చేతులు విరిచేస్తాను. (ఎడం చేతితో షట్పది చెయ్యి మెలి త్రిప్పుతుంది) షట్పది : ఏమిటీ దౌర్జన్యం... ప్రభువుతో చెప్పి. కజ్జల : (ఈర్ష్యతో) శిక్ష వేయిస్తావా! (హారం తెంచి) కృతఘ్నురాలా! ఇదిగో హారం - బలవంతంగా తీసుకున్నావు. ఎవరితో చెప్పుకుంటావో. షట్పది : నా హారం నాకివ్వు. కజ్జల : నా సౌధంలో నుంచి బయటికి కదులు. షట్పది : నీవు దొంగవు... అందరికీ చెపుతాను. బలవంతంగా నా హారాన్ని కాజేశావు. కజ్జల : నిజంగానా, దొంగనా. ఇదిగో నీ హారం తీసుకో... ఇచ్చే స్తున్నానుండు. (హారాన్ని తెంచి దానిలో పచ్చరాయిని బల్లమీద పెట్టి చిన్నరాతితో ముక్కలు ముక్కలుగా కొట్టేస్తుంది) షట్పది : ఆఁ... ఆఁ ఘనకార్యం చేశావు. అశక్తురాలవు. అంతకంటె నన్ను ఏం చేస్తావు పాపం! నీ కళ్ళమంట తీరిందా. ఎంత అఘాయిత్యమే జంతువా? మహారాజు యిలాంటి నిన్ను ఇంకా ఎలా ప్రేమిస్తాడు? నాతో ఏమని చెప్పాడో చెప్ప మన్నావా? కజ్జల : (ఉరోభాగాన్ని నిక్కించి రాజసంతో) నోరు ముయ్యి. షట్పది: నాకేం అవసరం. నువ్వే ముయ్యి. నిన్నూ నీ దురవస్థనూ చూచి రాజూ నేనూ ఇప్పుడే నవ్వుకుంటాము. ఆయన నన్ను మనసారా ప్రేమిస్తున్నాడు. నాకు యౌవనముంది నీవు ముదివగ్గువు. నీలో ఈర్ష్య చావలేదు యౌవ్వనం చచ్చినా - కజ్జల : (కలవరపాటుతో) (లేచి పక్క గుడ్డలు అటూ ఇటూ విసరి పారేసి తలగడ క్రింద కత్తి తీసి) ఏదీ మళ్ళీ అను ఆ మాట (షట్పది మీదికి పొడవటానికి వస్తుంది) షట్పది : (భయంతో) అమ్మయ్యో! రాక్షసీ! రజా, రుజా, కజ్జా!! కజ్జల : ఒళ్లు దగ్గిర పెట్టుకొని బ్రతుకు. నాతోనా నీకు. జాగ్రత్త తులువా! (కత్తి విసరి క్రింద పారవేయబోతూ) ఈటిముండ - మెడబెట్టి గెంటిస్తాను. పాలుపోసి పెంచినందుకు పాము వనిపిస్తున్నావా జాగ్రత్త (తలుపులలోనుంచి రజా, కజ్జా తొంగి చూస్తారు. “ఎవరా పక్షులు" అనే కజ్జలాదేవి ఉన్మత్తకంఠం విని, బయటికి వెళ్ళిపోతారు) కదలు అవతలికి. (షట్పది నెమ్మదిగా కన్నీటితో వెళ్ళిపోతుంది) పాపిష్ఠిముండ - బంధకి (కత్తి నేలమీద పారేసి పర్యంకం మీద వాలిపోతుంది) ఏకాంకికలు 393
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/393
ఈ పుటను అచ్చుదిద్దలేదు