పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/389

ఈ పుటను అచ్చుదిద్దలేదు

షట్పది : (పెదిమల మీద చేయి పెట్టి నివారిస్తూ) ఇష్-ఇష్. సారంగదేవి : (కజ్జలాదేవిని చూస్తూ) కలలు కంటున్నావా తల్లీ! నీ స్థితిని నీవు అర్థం చేసుకోలేని దుస్థితిలో పడ్డావు. నీ లోపాలను చెప్పే పెద్దలెవరూ నీకు లేరు. అందరూ నిన్ను జూచి అడుగులకు మడుగులొత్తే వారే. అమ్మా! నీ చుట్టూ ప్రసరించే గాలి, వెలుతురు, పాపభూయిష్ఠం! పాపభూయిష్ఠం నీవల్ల కాశ్మీరంలో నీతి అవినీతి అవినీతి నీతిగా మారిపోతున్నది. అమ్మా నేనీ సౌధంలో విశేషకాలం సంతోషంగా బ్రతకలేను. షట్పది : సర్వసంగ పరిత్యాగం చేసుకొని భిక్షుక సంఘంలో చేరిపోవాలని నీకు ఎన్నడైనా కోరిక కలిగిందా ఏమిటి? సారంగదేవి : ఎందుకలా ప్రశ్నించావు షట్పదీ. నా హృదయం ఎపుడో నీకు అర్థమైనట్లు మాట్లాడావు. ఈకోరిక ఎప్పుడో ఒకప్పుడు కాదు. అనేకమార్లు కలిగింది. మన జీవితాలకు శాంతి మహాయానంలో తప్ప దొరకదని అమ్మకు ఎన్నో మాట్లు మనవి చేశాను. ఆమె ఈ సౌధాన్ని వదలిపెట్టలేదు. భ్రమ పడ్డా ఈ సౌఖ్యాలకు స్వస్తి చెప్పలేదు. అందుకు ఎన్నడూ అంగీకరించింది కాదు. షట్పది : అందులో ఆమె దోషమేమీ లేదు. నీ మేలుకోరి చేసింది ఆ పని. సారంగదేవి : ఇకముందు నేను పరిపూర్ణానందాన్ని అనుభవిస్తానన్నమాట కల్ల. ఆమె మటుకు ఏమి సుఖపడుతూ ఉన్నది. ఎప్పుడూ కన్నీళ్ళలో కరిగిపోతున్నది. ఆమెకు బ్రతుకులో సుఖస్వప్నం వంటి ఒక్క నిమిషమైనా ఉన్నదెప్పుడో చెప్పు షట్పదీ! షట్పది : ధర్మాధర్మాలు నీ వనుకున్నంత నిశ్చితాలు కావు తల్లీ! ఒకరి నొకరు ప్రేమించుకోవటం పాపం కాదు. ప్రేమ అమృతం వంటిది. రాహు కేతువులు ఆ అమృత పానం వల్లనే కదా దేవతలను క్షణకాలమైనా జయిస్తున్నారు. ఆ ప్రేమ ముగ్ధ. యౌవనంలో ఉన్నప్పుడు వ్యక్తి ఒక పాపమైనా చేయలేక పోవటం పాపము! సారంగదేవి : షట్పదీ వెనుకటినుంచీ నీకూ ఈ వెర్రి సిద్ధాంతాల మీద అభిమానం ఉన్నదా? షట్పది : పురుష హృదయాలను చేత జిక్కించుకొని వాటికి అధిష్ఠాన దేవతలమై పాలించటం! కీర్తితో లోకాన్ని వ్యామోహ పెట్టటం!! కాంక్షలో కైపు!!! ప్రణయ కోపాలతో ఎంతంత మహాప్రభువులను పాదదాసులను చేసుకోవటం ఉజ్జ్వల యౌవనానికి ఏకాంకికలు 389