పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/388

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సారంగదేవి : నే నీ పాపాన్ని భరించలేను. ఈ పాపంలో బ్రతకలేను. ఈ పాపవాయువు క్రమక్రమంగా నా ప్రాణాన్ని హరిస్తున్నది. అనేక రాత్రులనుంచీ నాకంటికి కునుకు లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్తంభించినా బ్రతుకుతున్నాను. నా ఇంట్లో ఏ వస్తువును ముట్టుకున్నా కళంక భూయిష్ఠం పాప పంకిలము. ఎన్నాళ్ళబట్టో మృత్యువును ఆహ్వానిస్తున్నాను. కొలది కాలం క్రితం దర్శనమిచ్చింది. ఆనాటినుంచి ఆమె వికట నృత్యాన్ని దర్శిస్తూ ఆనందిస్తున్నాను. చివరకు ఆమె చిన్మయహాసంలో నురుగునై పోవటానికి నిశ్చయించుకున్నాను. ఇక జీవించ లేను షట్పదీ! జీవించను - షట్పది : అమ్మాయీ! ఏమిటా లేనిపోని పిచ్చి ఊహలు. నీకేం శరీర స్వస్థత లేదా? సారంగదేవి : షట్పదీ! ఎందుకు నాచేత చెప్పించటము. ఇందులో నీవెరుగని దేమున్నది. నా అవమానపు బ్రతుకును చూస్తుంటే నీకు అసహ్యం కలగటం లేదూ. నాతో మాట్లాడేటప్పుడు నాచుట్టూ ఉన్న వ్యభిచార వాయువు మీమీద సోకటం లేదూ? (కంటికి గుడ్డ అడ్డం పెట్టుకొని దుఃఖిస్తుంది) షట్పది : తల్లీ! సారంగీ! సారంగీ! సారంగదేవి : షట్పదీ! (నిద్రలో ఉన్న కజ్జల దేవిని చూచి) నా మాటలన్నీ అమ్మ విన్నదా? లేదు. ఇంకా దీర్ఘనిద్రలోనే ఉన్నది. ఆమె వినకూడదు. నా హృదయంలో ఏమున్నదో ఆమెకు తెలియ కూడదు. తెలిస్తే నేను బ్రతకను. అప్పుడు నా దుఃఖమే నాకు దహనాగ్నిగా మారిపోతుంది. (కజ్జలను చూపిస్తూ) ఆమె వివాహిత. వితంతువైనా మహారాజు అనేక వివాహాలు చేసుకున్నాడు. ఇద్దరికీ సంతానం ఉన్నది. కానీ వీరి వ్యభిచారం లోకంలో ఏ మహాభావమూ ఆపలేకపోతున్నది. వృద్ధాప్యానికి చేతగానప్పుడు... ఈ పాపపంకిలంలో ప్రాణాలు ఉగ్గబట్టుకొని బ్రతుకుతూ ఉన్న నేను చాలక - ఈ పాప కారాగారంలో ఈ పాపకూపంలో నాకు తోడుగా మరొక ప్రాణిని పంపించాడు బ్రహ్మ. అమాయక ప్రజ! దానికేం తెలుసు, తమ్ముణ్ణి పొగడటానికని వచ్చారు. కజ్జలా దేవి మహారాణి అని వారి విశ్వాసం. కాబొయ్యే యువరాజని తమ్ముడికి జయ పెట్టవచ్చారు. ప్రజదేముంది, అమాయక ప్రజ. ప్రజలకు తమ్ముడు యువరాజు, అమ్మ మహారాణి నేను రాజకుమార్తెను, ప్రభు వర్గంలో అమ్మ... చెప్పలేను - మేము తొత్తు సంతానము, (ఏడుస్తూ) నా యీ దేహం, దానికి సంబంధించిన సమస్తమూ పాపానివి, మహా పాపానివి, నా తండ్రి వ్యభిచారి, తల్లి వ్యభిచారణి. ఈ కళంకాన్ని కడిగి వేసే దివ్యహస్తాలు ఏ దేవతాలోకంలో ఉన్నవో! 388 (కజ్జల నిట్టూరుస్తుంది) వావిలాల సోమయాజులు సాహిత్యం-2