పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/387

ఈ పుటను అచ్చుదిద్దలేదు

స్వయంగా ఎవరి సౌధానికి వచ్చి ఆదరించింది? అమ్మాయీ! ఇది నీకూ కజ్జల దేవికి ఎంత శుభదినం... ఎందుకో నీవు కూడా సంతోషంగా లేవు తల్లీ - సారంగదేవి : నా ఆనందాన్నంతా నీకిస్తాను, మనః పూర్వకంగా అనుభ వించి ఆనందించు. పరమాత్మను నా పునర్జన్మలోనైనా ఇటువంటి శుభదినాన్ని నాకు ప్రసాదించవద్దని ప్రార్థిస్తు న్నాను. నా పరిస్థితిలో మీరుండి ఈ ఆనంద సమయాన్ని అర్థం చేసుకుంటే నేను సంతోషంగా లేకపోవటానికి కారణం అవగతమౌతుంది. షట్పది : అంటే - నీ అభిప్రాయము. - సారంగదేవి : (కంట తడితో) ఏమీ లేదు. షట్పది : అమ్మాయీ! ఏమీ లేకపోతే ఏమిటా కంటతడి. సారంగదేవి : ఏమీలేదు షట్పదీ. (కంటతడి తుడుచుకుంటుంది) షట్పది : అమ్మాయీ! నీవు కూడా కొన్నాళ్ళనుంచీ ఏదో అర్థంగాని బాధ అనుభ విస్తున్నావు. నేను వినగూడని అంశమేదన్నా నిన్ను కలవరపెడుతున్నదా? సారంగదేవి : నీవు వినగూడనిది నా జీవితంలో ఏదన్నా ఇంతవరకూ ఉన్నట్లు విన్నావా? షట్పది : కానప్పుడు నీ చింతకు కారణమేమిటో నాకు బోధపడటం లేదు - చెప్పు తల్లీ! అనవసరంగా మనస్సులో పెట్టుకొని ఎందుకు కృశిస్తావు. నేనంటే నీకు అనురాగం తప్పి పోయిందా? అయితే బ్రతిమాలనులే. సారంగదేవి : షట్పదీ ఏమిటా నిష్ఠూరం. నన్ను మళ్ళా అనవసరంగా ఏడిపించటానికి ప్రయత్నించవద్దు. నేను ప్రస్తుతం మాట్లాడకుండా ఉండటం తప్ప మరొక పని చెయ్యలేను. షట్పది : ఇప్పుడు దుఃఖించావన్నమాట. సంగతేమిటో బయటపెట్టు తల్లీ! అంత దుఃఖించవలసిన అగత్యమేమి వచ్చింది - నీ ప్రియుడేమైనా నిన్ను మోసగించాడా? సారంగదేవి : (దుఃఖంలో నవ్వుతూ) లేదు. షట్పది : మరి - సారంగదేవి : నే నీ నీచమైన బ్రతుకు గడపలేకుండా ఉన్నాను. షట్పది : అంటే నీ అభిప్రాయం ఏకాంకికలు 387