పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/386

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కంచుకి : ఆ నిమిషమే నిన్ను జగజ్జేతను చేస్తుంది. నీ పతనానికి నీవే కారణభూతు రాలవు కావద్దు కజ్జలా! ఆలోచించుకో - (వెళ్ళబోతాడు) కజ్జల : (నీరస కంఠంతో) కంచుకీ! కోపం వద్దు. నన్ను ఒంటరిగా విడిచిపోవద్దు. ఈ జబ్బు నన్ను పీల్చి పిప్పి చేసి సగం చేసింది. నాలో శక్తి ఏదో నన్ను వదలి పెట్టిపోయింది. స్వయంగా ఆలోచించలేను. కన్నబిడ్డలా చూస్తూ ఉన్న నీవే నన్ను కాపాడాలి. ఆ భారం నీది... కంచుకీ - కాసేపు నన్ను విశ్రమించనీ. చేయి ఊత ఇచ్చి పాన్పు మీదికి చేరుస్తే ఆమె పవళిస్తుంది.) ద్వితీయ దృశ్యము - (కంచుకి (రాజసౌధంలో కజ్జలాదేవి మందిరం. కజ్జలాదేవి గాఢంగా నిద్రిస్తూ ఉంటుంది. కుమార్తె సారంగదేవి ఒక ప్రక్కన వీణా నాదం చేస్తూ ఆలోచనా నిమగ్నురాలై ఉంటుంది.) షట్పది : అమ్మాయీ! కజ్జలాదేవి గాఢనిద్రలో ఉన్నది. మనం ఇక్కడ పాడుకుంటూ ఆమె సుషుప్తికి భంగం కలిగించటం భావ్యం కాదు. ఎప్పుడూ ఏదో అవ్యక్తమైన బాధ అనుభవిస్తూ ఉంటుంది. ఈ దినం చాలా నీరసించిపోయింది. సారంగదేవి : నిజమే! షట్పదీ తోచక ఏదో పాట పాడుతున్నాను గాని, ఆమె నిద్రకు అంతరాయం కలిగించటము ఏమాత్రమూ నాకు ఇష్టం లేదు. నీవన్నట్లు ఆమె ఎప్పుడే ఏదో అవ్యక్తమైన వేదన అనుభవిస్తూ ఉన్నది. నేను పుట్టినది మొదలు చూస్తూనే ఉన్నాను. ఆమె జీవితంలో సుఖంగా గడిచిపోయింది ఒక దినమూ నాకు కనిపించలేదు. షట్పది : (పెదవి విరుస్తూ) పాపం! ఆమె ఎన్నడూ సుఖంగా లేదు. అందులో ఈ ఉదయం. (వాతాయనంవైపు నడిచి చూచి వచ్చి దీర్ఘంగా నిశ్వాసిస్తుంది) సారంగదేవి : ఎందుకో దీర్ఘంగా నిశ్వాసిస్తున్నావు షట్పదీ! షట్పది : కజ్జలదేవి జీవితంలో ఇది ఎంత మహోత్సాహసమయం. సమస్త కాశ్మీరమూ సాదర గౌరవం చూపించటానికి ఈనాడు ఆమె సౌధం చుట్టూ చేరింది. మహారాణి 386 వావిలాల సోమయాజులు సాహిత్యం-2