కంచుకి : అమ్మాయీ! మరొకమాట రానియ్యకు. నేను వెళ్ళిపోతాను. (బయలు దేరతాడు) కజ్జల : ఆగక్కడ. ఎవరా వ్యక్తి? ఇంతకు ముందెందుకు చెప్పలేదు? కంచుకి : నీవే తెలుసుకుంటావని. నీవు గ్రహించలేకపోవటం నా దోషమా? కజ్జల : నమ్మి నా గుట్టంతా నీ చేతుల్లో పెడితే నీవు చూపించవలసిన కృతజ్ఞత ఇదేనా? కోరుకున్నదల్లా ఇచ్చి నిన్ను సంతృప్తి పరిచానే - ఇదేనా నీ సానుభూతి? కంచుకి : నామీద నీ నేరము. నీవీ స్థితికి రావటానికి కారకులెవరో మరిచిపోయి మాట్లాడకు. పదిహేను వసంతాలపాటు మహారాజు మనస్సు నీకిప్పించిన నా మీదనా నీ నేరము. కజ్జల : (తప్పిదాన్ని గ్రహించినట్లు) అవును నిజమే. అందుకు నేను కృతజ్ఞురాలను. కానీ కంచుకీ, నా జీవితంలో నిమిషం సుఖం లేదు. ప్రతి దినమూ ఏదో ఒక ప్రళయము. మిన్ను విరిగి మీద పడటము. చిట్టచివరకీ మోసము. నా విజయశ్రీ ఎంత చంచలమైంది కంచుకీ - జయించి సుస్థిరమనుకున్న విజయం ఇన్నిమార్లు చేయి జారిపోతుంటే ఎన్ని ప్రయత్నాలు చేసేది. కంచుకి : రూపంతో మురిపించి నన్నాళ్ళు మురిపించావు తల్లీ - ప్రణయ సామ్రాజ్య జయపతాకవైనావు. ఆ రూపం అనిత్యం. అందువల్ల చేకూరే విజయమూ అనిత్యం. నిన్ను మించిన సౌందర్యం నిన్ను త్రోసి రాజన్నది. అది పరిపూర్ణ విజయం పొందటం భావ్యం కూడా. నీవు అనుసరించే మార్గము ఇంత కంటే సుస్థిరమైన విజయాన్ని ప్రసాదించలేదని చెప్పిన నా మాటలు నీకు వెనుక నచ్చినవా? కజ్జల : ఆ శాశ్వత విజయానికి మార్గమేమిటో? కంచుకి : (చిత్రంగా కజ్జల కళ్ళల్లోకి చూస్తూ) వెనుక విన్నవించిందేగా నీకే తెలుసు. కజ్జల : (కోపంతో) ఛా! నోరు ముయ్. కంచుకి : నేను ఎవరి క్షేమం కోరి మాట్లాడుతున్నానో గ్రహించావా? అతి స్వల్పతంత్రం. కజ్జల : ఆ ప్రసంగం మరొకమాటు రానిస్తే మన్నించను కంచుకీ! 384 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/384
ఈ పుటను అచ్చుదిద్దలేదు