పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/381

ఈ పుటను అచ్చుదిద్దలేదు

- రాణి : క్రౌర్యంగానీ, అనురాగం గానీ కలకాలం అనుభవించేది కాదుగా అందుకోసమని కలకాలం యుగయుగాలు, తరతరాలు గౌరవాది నరకాలల్లో రాక్షసబాధలనుభవిస్తారా? కజ్జల : (ఉద్వేగంతో) ఒకనాటి దైతేనేం - ఒక క్షణకాలానిదైతేనేం విజయం విజయమే దోషానికి మొగ్గలేక జీవితాన్ని తొలగదోసుకోబోయే పిరికిగుండె ఎవరికో గాని ఉండదు. అందులో ప్రేమకోసం క్రౌర్యం - ఈర్ష్య ఎంత గొప్ప విశేషాలు. ఎన్ని జన్మలకైనా సాధించతగ్గవి. దేవీ - ప్రేమించ లేని ఆత్మ జీవించటమే లేదన్నమాట. ప్రేమించిన తరువాత సాధించలేకపోవటం మరీ చవటతనం. నా దృష్టిలో ప్రేమ విజయమే ప్రధానం గాని పరమపాపిష్ఠి నరకమన్నా భయంలేదు. ఆ సాధనలో చరమ సోపానాన్ని చేరుకొని పడిపోయినా భయం లేదు. ఆ సాధనలో ప్రాప్తించిన నరకంలోనే స్వర్గ సౌఖ్యమున్నదని నా ఆశయం. రాణి : కజ్జలా! ఎందుకంత ఆవేశం. ఏమిటా దీర్ఘ నిశ్వాసాలు. ఉం... ఆ పిశాచాలను పూజించేవారంటే నీకూ అభిమాన మన్నమాట. ఈ మాటకు అంగీకరిస్తావా? కజ్జల : : అంగీకరించటమూ కాదు. అంగీకరించకపోవటమూ కాదు. వారి మనస్సులను అర్థం చేసుకొని వాళ్ళ దైన్యానికి చింతిస్తున్నాను. కాదు కాదు. వాళ్ళ సాహసాన్ని అభినందిస్తున్నాను. పాపం చెయ్యడానికి ప్రయత్నించాడని రుజువు కావాలనే పరమ దౌర్భాగ్య దండన విధించుటకేనా? పాపం చెయ్యటానికి ఎంతటి వీరగుణం కావాలో ఆలోచించాలి. అంత సాహసానికి పూనుకోవలసిన ఆగత్యమేమిటో అవగతం చేసుకొని దోషి అని తోస్తే దండన విధించడం ఎంత సమంజసము! రాణి : కజ్జలా! నేను ఎవరినీ ఉద్దేశించి ప్రసంగించటం లేదు. దూషించటం లేదు. ఏమిటీ ఉద్వేగం. నా మాటలు నిన్ను ఇంత కలవరపెడుతవని కలలో కూడా భావించలేదు - వృధాగా ఎందుకు శరీరానికి అలసట తెచ్చి పెట్టుకుంటావు. పచ్చి వళ్లు బహు జాగ్రత్తగా పథ్యం చేయాలి సుమా! ఇంత లోనే ఎంత చెమట పోసింది అంత ఇష్టం లేకపోతే ఆ ప్రసంగం నేను మటుకెందుకు చేస్తాను - కజ్జలా! నా పతకాన్ని ఏం చేశావు? కజ్జల : మీ పతకము? రాణి : అవును. నా పచ్చల పతకము. కజ్జల : మీ అభిప్రాయము? ఏకాంకికలు 381