సారంగదేవి : (కొంతదూరం పసిబిడ్డను అందుకొని నడుస్తుంది. ప్రజ "కుమార మహాప్రభువుకు జై" అని కేకలు వేస్తూ ఉంటారు) కంచుకి : (సారంగదేవిని అనుసరిస్తూ) అమ్మాయీ! సారంగదేవి, అటు చూడు. ఎంత ఆనందకరమైన దృశ్యమో చూడు. సమస్త కాశ్మీర ప్రజానీకం నీ తమ్ముణ్ణి దర్శించటానికి వచ్చారు. ఉత్కంఠతో ఎంత ఉత్సాహాన్ని ప్రకటిస్తున్నారో చూడు. నీ అదృష్టాన్ని ఏమని కొనియాడాలో తల్లీ ... అమ్మా ఎప్పుడూ ఏమిటా అర్థం కాని అయోమయ చింతారేఖలు నీ ముఖం మీద. సారంగదేవి : (పసిబిడ్డను చత్వరం దాకా తీసుకు పోయి పెద్ద పెట్టుగా) అబ్బా బాధ కంచుకీ - నీవు చూపించు. (వెనుకనే నిలుస్తుంది) కంచుకి : (పిల్లవాణ్ణి తీసుకుపోయి చూపిస్తుంటే ప్రజలు జయఘోషలు చేస్తారు కజ్జలా దేవితో) - అమ్మా! ప్రజలెంత ఆనందంతో అబ్బాయికి జయపెడు తున్నారో వింటున్నారా! వాళ్ళకు ఆయనమీద ఎంత అనురాగమో చూస్తున్నారా. అదుగో! ఆవైపు చూడండి ఉత్సాహాధిక్యంలో ఉత్తరీయాంశుకాలు ఎలా ఎగుర వేస్తున్నారో! ఆ కుంకుమ కేసరాలు చల్లుకోటం చూస్తున్నారా? చిందులేసి నృత్యం చేసే ఆ చిన్నవాళ్ళ గుంపును చూడండి. ఆబాలగోపాలమూ ఎంత అనురాగాన్ని ప్రకటిస్తున్నారో మీకు అవగతమౌతున్నదా? ఏ రాజకుమార దర్శనానికి... కజ్జలాదేవి : ఇంకా నా మనస్సుకు సంతృప్తి కలుగలేదు కంచుకీ - మా రాజమహిషి బంధులుణ్ణి కన్నప్పుడు ప్రజ చూపించిన అతిశయానురాగానికి ఇది సాటి వస్తుందా? ఒక వసంత మన్నా బ్రతకకపోయినా ఆ బంధులుడు అతని దర్శనార్థం విచ్చేసి ప్రజలు చూపించిన ఆనంద రసావేశం నా జీవితంలో మరచిపోలేను. వారి సంతోష సూచకధ్వనులు ఈనాటికీ నా చెవుల్లో రింగుమని మార్మోగుతూనే ఉన్నవి కంచుకీ! ఈ ఉత్సాహంతో నా మనస్సు శాంతి పడటం లేదు. సంతృప్తి కలగటం లేదు. బిడ్డను నా చేతికిచ్చి ఒక్కమాటుగా ఆ బొక్కెనలు విప్పి రౌప్యఖండాలను ప్రజల లోకి వెదజల్లు - ఆ కాంచన కుంభాలలో పన్నీరు చిలకవోయ్ - ఆ గులాబీ కుంకుమతో ఒక్కమాటు వాళ్ళందరినీ గప్పివేయ్. - 376 వావిలాల సోమయాజులు సాహిత్యం-2
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/376
ఈ పుటను అచ్చుదిద్దలేదు