పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/374

ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాచమ్మ : ఎప్పుడూ మేఘాలు - మట్టీ మశానం తీసినవి పిచ్చెక్కినా కవిత్వం మానలేదుగదా బ్రాహ్మణుడు. ఈ పిచ్చే అందువల్ల అయితే అదెక్కడికి పోయింది. పోతన్న : (ఎవరి ప్రశ్నలతో సమాధానమిస్తున్నట్టు). ఔను.... ఆ.... నిరుపేదనే నీవన్నట్లు.... నా జీవనమా? నీ కృపవల్ల... రాజుల నెవరినైనా ఆశ్రయించమంటావా. నా కంఠంలో ప్రాణముండగా.... లేదు తల్లి.... నాకు ఏకోశానా ఆ ఊహలేదు.... ఇదుగో నీవన్నట్లు రామచంద్రమూర్తికే నిన్నిచ్చి కల్యాణం చేస్తాను - వాగ్దానమూ. (చేతిలో చేయివేస్తున్నట్లుగా చేయి ఉంచి) కాటుక కంటినీరు చను కట్టుపయింబడ నేల యేడ్చెదో కైటభ దైత్యమర్దనుని గాదిలి కోడల, ఓ మదంబు, ఓ హాటక గర్భురాణి నిను నాకటికిం గొనిపోయి అల్ల క ర్ణాట కరాట కీచకులకమ్మ త్రిశుద్ధిగ నమ్ము భారతీ - సంతోషం తల్లీ - తిరోగమిస్తున్నావా - నామాట ఏం చెప్పినట్లు - ఊః సరే- మాచమ్మ : వెర్రి వేయి విధాలంటారు - ఇది ఆ వేయిలో చేరుతుందో లేదో! ఇటువంటి వాళ్ళు వెనక పుడితేగా చేరటానికి - ఊ చేరదు. - పోతన్న : (అమితానందంతో కళ్ళు.... ముడిచి మళ్ళా తెరిచి) అమ్మా - అమ్మాయి తీరా వెళ్ళి పోయిన తరువాత వచ్చేశాం అభయమిచ్చేశాను. ఆమె ఆ రామచంద్రమూర్తికే తన్నిచ్చి వివాహం చేయమంది - రామచంద్ర ప్రభో! రామచంద్ర ప్రభో!! (విగహ్రం వైపు చూస్తూ పరమానందంతో) త్వరలో నీ వివాహం తండ్రీ . అమ్మాయి వచ్చి స్వయంగా నిన్నే వరించింది తండ్రీ - (దారు విగ్రహం ముందు మోకరిల్లి) నమోనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే నానా వాదానురోధాయ వాచ్య వాచక శక్తయే - (సాష్టాంగ ప్రణామం చేస్తాడు. వెనుక మాచమ్మ ఆశ్చర్యంతో ముక్కుమీద వేలు వేసుకొని చూస్తూ నిలబడుతుంది. 374 (సమాప్తం) (ప్రజావాణి - 7-10-62 - 28-10-62) వావిలాల సోమయాజులు సాహిత్యం-2