పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/370

ఈ పుటను అచ్చుదిద్దలేదు

(లోపల నుంచి మాచమ్మ తలకు పట్టువేసి ప్రవేశించి) సీతమ్మ తల్లి! సీతమ్మ తల్లి!! ఈ చెరలు నేను పడలేకుండా ఉన్నానమ్మా... ఈ సంసారంతో నేను వేగలేకుండా ఉన్నానమ్మా... నాకు ఏ నుయ్యో గొయ్యో చూపించు తల్లీ - మల్లన్న : ఇప్పుడేమొచ్చిందమ్మా? మాచమ్మ : ఎప్పుడూ వచ్చేదే ఇప్పుడూ వచ్చింది. గొంతుకు ఉరి పెట్టుకుందామన్నా ఊపిరాడదు గదా! ఏ మహాపాపం చేశానో కాని, అన్నిటికీ ఒక్కతెను ఆడపక్షిని. అటు పొలం పోయి గడ్డే తెచ్చేదా ఇటు పొయ్యి మీది పనే చూసేదా... ఈ పూట నాకు కూడా కాక తగిలినట్లుంది. మల్లన్న : ఊఁ-కానీ నువ్వుకూడా మంచమెక్కు. మాచమ్మ : (పోతన్నను చూస్తూ) మహారాజులు ఎక్కేవాళ్ళు ఎక్కితే సరిపోతుంది గాని నేనెక్కితే ఊరుకుంటారా. మెడబెట్టి గెంటుతారు. మల్లన్న : అమ్మా! ఏం తలనొప్పి వచ్చిందా ఏం - దుప్పికొమ్ము గంధం పట్టేశావు. కాసేపు అలా వెన్ను వాల్చరాదూ తగ్గుతుంది. మాచమ్మ : ఆ అంత అదృష్టం కూడానా ఆ మోపెడు అంట్లూ ఎవరుతోముతారు. నా తాత వెనక వాళ్ళూ, అబ్బ వెనక వాళ్ళూ- మల్లన్న : అమ్మా! నీకేం కష్టం వచ్చిందనమ్మా అనవసరంగా అనని మాటలు అనుకోటం. అవతల ఆయన లేవలేకుండా బాధపడుతుంటే ఉత్త అఘాయిత్యం తప్ప. మాచమ్మ : అంతే.... అంతకంటే ఇంకేమయింది అయ్యకు చేతనైనపని. ఆయనను వెనక వేసుకోరావటం అయినదానికీ, కాని దానికీ. కష్టపడి కనిపెంచినందుకు - అమ్మకు చేసే సాయం బాగుంది నాయనా. బాగుంది. మల్లన్న అమ్మా! ఇప్పుడెందుకు అనవసరంగా అంత గొంతు పెట్టుకొని అరవటం. మాచమ్మ : ఔవ్వ..... నోరు నొక్కేసుకోమన్నావా? మల్లన్న : అసలు విషయమేమిటమ్మా! మాచమ్మ : (పోతన్నను చూస్తూ) ఊ, ఆ, అనకుండా చేసే పని చేసి బెల్లం కొట్టిన రాయిలాగా ఊరుకోటం. 370 వావిలాల సోమయాజులు సాహిత్యం-2