పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/321

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమితావి : అలాగా అమ్మా! బుద్ధభగవానుని హయరత్నం పేరు వీటికి పెట్టుకున్నాను. - మీరు పాములకు ఆట నేర్పారట!

ఉత్పల : ఎందుకా ఆశ్చర్యం? వాటిని పెంచటం చాలా సులభం.

అమితావి : మొన్న ఆరామానికి ఒక ఉపాసిక శ్రావస్తి నుంచి వచ్చింది. ఆమె పులులను పెంచిందట!

ఉత్పల : ఆమె చపలా ఏమిటి చెప్మా!

అమితావి : ఆమె ప్రాకృతంలో కవిత్వం కూడా చెప్పుతుంది.

ఉత్పల : అయితే సుజాత ఐ ఉంటుంది. ఓ సుప్రసిద్ధ రాజనర్తకి.

అమితావి : ఆమె పెంచే పులులు... అమ్మా! అరుగో భదంతులు.

భదంతుడు : అమ్మా! పూర్వ శైలం మీద ఆనందభిక్షువుతో మాటాడి రావటంలో ఆలస్యమైంది.

ఉత్పల : భదంతా! ఇక్కడ నాకే లోపమూ జరగలేదు.

అమితావి : భదంతా! కొన్నాళ్ళ క్రితం ఒక నర్తకి వచ్చిందే ఆమె పులులను పెంచుతుందట విన్నారా?

భదంతుడు : ఆమె కవయిత్రి అని మాత్రం నాకు తెలుసు. అమ్మా, నీకామె తెలుసునా? ఇప్పుడెక్కడుంది?

ఉత్పల : ఔను! ఇప్పుడామె ఊరూపేరూ లేదు. పాపము కాలగర్భంలో కలిసిపోయి ఉంటుంది

(పక్షుల కిచకిచలు, కూతలూ దూరంనుంచి వినిపిస్తవి)

అమితావి : అదిగో! కంటకాలు. ఆకాశం నుంచి దిగి వచ్చినట్లున్నవి. దాహం ఇచ్చి వస్తాను. ('గు'గ్గూ అంటూ నిష్క్రమణ)

భదంతుడు : అమ్మా! జ్ఞప్తికి రావటం లేదు, ఆమె పేరేమిటన్నారు?

ఉత్పల : సుజాత...

భదంతుడు : ఔను సుజాత... ఈ అతిథి గృహంలో ఆమె వ్రాసిన గీతం ఒకటి చెక్కించింది. అదిగో.


ఏకాంకికలు

321