భుజంగం : ఓ వెయ్యి రూపాయలు మనవి కాదనుకుంటే మద్రాసులో మనపని జరిగిపోతుంది -
చంద్రశేఖరం : పోనీ ఎవడికో మందుపెట్టి చంపినట్లు వైద్యుడు కదూ ఎవడో చావకుండా ఉంటాడా అతని చేతిలో.
భుజంగం : మహజరు వెనక మరిన్ని సంతకాలుంటే కఠినశిక్ష చెప్పించవచ్చు కూడా. మోతుబరీ సాక్ష్యం బనాయిద్దాము.
చంద్రశేఖరం : మిల్లుదగ్గిర రైల్వేస్టేషను పెట్టించాలని అప్లికేషను వ్రాసి సంతకాలు పుచ్చుకుంటాను. ఓ నాలుగువేలు అయిన తరువాత దానికి ఈ మహజరు టైపుచేసి గుచ్చుదాము.
భుజంగం : భేష్ ! ప్లాను బ్రహ్మాండంగా ఉంది.
(సేవాసమితి ఆఫీసుముందుగా చైతన్యం, ప్రజాసేవకులతో పాట పాడుతూ
వెళ్ళుతుంటాడు)
భారత జయఘంటా! ఓహో
భవ్య విజయ ఘంటా!!
గణ గణ గణ గణ,
క్వణియింపుమురా!
మానవ మానస -
మహిమ జలేజము
మధుధారలతో
తిలకింప
ఋషిగణవాటీ
తుషితప్రశాంతి
కమ్రహాసముల
కుళుకులు నీన
విశ్వహృదంతర
విమలాలయముల
264 వావిలాల సోమయాజులు సాహిత్యం-2