పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/261

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బుడే : హది నాకీ హెంద్కు హమ్మాయగార్! షేకహరం బాబూ షెయ్యామందీ షేష్తాం. సాబ్ బూజుహంగం హివ్వమంది హిస్తాడ్ మాకి. బీబీ బిడ్డల్ బత్కుతుంటే పాచ్చామల్లే పాణం హుంటే.

జయ : బుడే! వీళ్ళెవరికైనా పేదవాళ్ళంటే దయ ఉందంటావా?

బుడే : హమ్మాయిగార్! హంతా మీకీ కొత్త షేషి కుంటారేమి - నాన్నగార్కి ధర్మం నైతో పేదల్ సాదల్ షచ్చిపోర్!

జయ : మాకు ఇంత డబ్బు ఎట్లా వచ్చిందో ఆలోచించావా? (లేదన్నట్లు తలూపితే) మీబోటి పేదవాళ్ళను కోటిమందిని పొట్టలు కొడితే వచ్చింది. మా నాన్నగారు మిమ్మల్ని పశువుల్ని చూచినట్లు చూస్తున్నాడు పట్టి పాలిస్తున్నాడు.

బుడే : మాకీ కూడా ష్వతంత్రంకీ హొచ్చిందిగా!

జయ : ఔను. మీ అజ్ఞానం ఇలా ఉన్నంతకాలం స్వతంత్రం కాదు స్వర్గం వచ్చినా లాభం లేదు. పోస్టాఫీసుకు వెళ్ళి ఉత్తరం పోస్టులో వేసిరా, చైతన్యం గారికి త్వరగా రేపే చేరాలి.

బుడే : చైతన్యంగార్కి? (ఔనన్నట్లు చూడగానే) అచ్ఛా! హమ్మాయిగార్ ! ఔ (నిష్క్రమిస్తూ) హమ్మాయిగార్! నాదీ పేరు ఫేఫర్లోన పడ్తుందంట మల్లీ - షాంకు హింట్కీ హెళ్తే బీబీ షూషీ షంతోషంతో

జయ : త్వరగా వెళ్ళిరా - నేను ఇంట్లో చిన్న పని చూచి వచ్చేటప్పటికి తిరిగి రావాలి నీతో పనుంది. మనం ఒక చోటికి వెళ్ళిరావాలి.

బుడే : మేఘాల్మే హెగ్రీ రానూ! (నిష్క్రమిస్తాడు)

(జయ నెమ్మదిగా నిష్క్రమిస్తుంది. భుజంగం వచ్చి కూర్చొని 'చంద్రశేఖరం గారూ' అని పిలువగానే 'వస్తున్నా' అనే సమాధానంతో ధర్మడబ్బాలు, లెక్క తీసుకొని చంద్రశేఖరం ప్రవేశిస్తాడు.)

భుజంగం : ఏమండీ! సమితి చందాలు సన్నగిల్లిపోతున్నట్లున్నవి?

చంద్రశేఖరం : ఆహా! అనుమానం లేకుండా, వందరూపాయలకు మించి ఒక్క కానీ పడటం లేదు డబ్బాల్లో -

భుజంగం : పోయిన నాలుగు నెలలు లెక్కా చదవండి.


డాక్టరు చైతన్యం

261