పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/260

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మల్లీ హిస్సా హుండాలి
ఔర్ హిమ్మత్ హుండాలి హిందూ...

మతంకోషం ఖొట్టుకుంటే
మందిదేషం మాడిపోద్ది
సునోభాయీ, దేఖో భయ్యా
లడైనైహై, భాయీ, భాయీ హిందూ...


జయ : లోకంలో ప్రస్తుతం జరుగుతున్న మాయానాటకంలో వీడు హాస్యరసాన్ని పూర్తి చేస్తున్నాడు.

బుడే : (వెనక్కు తిరిగి) హమ్మాయిగార్! - నాకీ మల్లీ హెట్టాహుండాన్ హమ్మాయ్‌గార్!

జయ : రాబొయ్యే మా కల్కి అవతారంగా ఉన్నావు -

బుడే : (సంతోషంతో) గల్గిహవతారం! (తృప్తితో హమ్మాయిగార్! - నాకీ హది హంతా. తెల్దుగాని, హంతా నాకీ షద్వూకొని హరేక్ హద్మీ హీనేటట్టూ షెప్పి హేషేషాన్గా, నాకీ -

జయ : ఏం చదువుకున్నావు?

బుడే : షంద్రంబాబూ కాగజ్ మే వ్రాషి షెప్పిందంతా హొప్పషెప్పి... బహుత్ ష్రమా హైందీ హమ్మాయి గార్! - షేవా హంటే యహీ హైతో మాకీ దిల్ మేఘాల్మే హెగ్రీపోద్ది.

జయ : ఏమేం చెప్పావేమిటి?

బుడే : హేమేం షెప్పావ్? 'బీదల్ సాదల్ హోక్టీహుందీ, బూజహంగం సాబ్ మన్కీ బహుత్ ఫాయిదాషేస్తాడ్. ముందుముందు ఖుసీ హుందీ' హంటూ నాకీ జండాపట్టి షిందూ వేస్తూ షెప్తాహుంటే, హమ్మాయిగార్ పాట నాకీ పాడే తల్కీ మల్లీ మల్లీ పాడమంటూ - నవ్వలేక షచ్చి పొయ్యార్‌గా ఝనం మల్లీ!

జయ : భేష్! నిన్ను పెట్టి ఈ మాటు ఒక కొత్త నాటకం ఆడారన్నమాట!

బుడే : నాట్కం? బలే బరమాహండం హైనా నాట్కం, హమ్మాయిగార్ మీకీ వచ్చి చూస్తే నాకీ హీనాం మీద హీనాం హిచ్చేవార్గా మల్లీ?

జయ : (తీక్షణంగా) ఇప్పుడు నీవు చేసిన పనిని గురించి ఏమైనా ఆలోచించావా?


260

వావిలాల సోమయాజులు సాహిత్యం-2