పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/257

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శ్వాపిండ దస్య కురుతే గజపుంగవస్తు
ధీరం విలోకయతి చాటుశతైశ్చ భుంక్తే"


అన్నాడు భర్తృహరి.

నిజం! కవి అన్నట్లే నీచజాతిదైనా కుక్క తిండిబెట్టే వాడి దగ్గిర సకలావస్థలు పడుతుంది. కానీ ఏనుగు మాత్రం మావటోడు ఆహారం తీసుకోవచ్చి బుజ్జగించి బతిమాలినా నోరు చాపదు. గొప్ప ఆశయాలు గలవాళ్ళ ప్రవర్తన ఎప్పుడూ ఇలాగే ఉంటుంది!

(దూరం నుంచీ రైతుకూలి రాజ్యమేను, రామరాజ్యమూ' వినిపిస్తుంది) (నవ్వుతూ) పట్టణాలల్లో ఈ ప్రచారం చేసి ప్రయోజనం? పిల్చ్! - (బోలో మహాత్మాగాంధీకి జై, పండిత్ జహ్వరులాల్ నెహ్రూకు జై, సర్దార్ భుజంగంగారికి జై, సేవాసమితికి జై (నానా రకాల ప్లేకార్డులతో పుణ్యకోటి ప్రవేశించి అన్నీ వరసగా ఆఫీసులో పెట్టిస్తాడు) (జయ, పుణ్యకోటిని లెక్కచేయనట్లుగా ఒకవైపుకు తిరిగి కూర్చుంటుంది. (పుణ్యకోటి రు. 5/- ఇచ్చి చాలకపోతే ఇదిగోనంటూ

రు. 10/- కాగితం విసిరివేస్తాడు కుర్రవాళ్ళకు - వాళ్ళు జై పుణ్యకోటిగారికి జై అని వెళ్ళిపోతారు. పుణ్యకోటి మెళ్ళో పూలదండను తీసి చెమట తుడుచుకొని దండ బల్లమీద పెడుతూ)

పుణ్యకోటి : జయా! నీవు సభలవైపు రాలేదు.

జయ : రా దలచుకోలేదు. - అయినా వస్తే సభలో ఏ అభాసు ఔతుందో నని భయపడ్డాను కూడా.

పుణ్యకోటి : అదేమిటి? నీ ధోరణి క్రొత్తగా ఉంది.

జయ : ఈ నటనంతా ఎందుకు? నన్ను గురించి నీవు ఏమీ వినలేదూ?

పుణ్యకోటి : క్లబ్ ప్రసంగం విషయమేనా?

జయ : నిన్నటి రాత్రి బడి విషయంగూడాను.

పుణ్యకోటి : అదేదో పాలసీకోసం నాన్నగారి ఇష్టంమీద మాట్లాడావను కున్నా. రాత్రిబడి నాన్నగారే నడపమని మొన్న అన్నట్లున్నారు? - అందరం ఒకేరకంగా మారితే కాలం మారినప్పుడు చెలామణి ఉండకపోవచ్చు.


డాక్టరు చైతన్యం

257