రేణు : ఔనౌను. నిన్న నిలయంవారి వార్షికనివేదిక విన్నాను. అంతవరకూ స్త్రీ జనోద్ధరణకోసం కొన్ని లక్షలు ఖర్చుపెట్టారట! ఆ సంస్థకు సంబంధించిన యువతి ఒక్కతే దేశంలో ఏ మంచి అంశంలోను పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నట్లు వినిపించదు కనిపించదు.
జయ: సాంఘికంగా రాకపోవచ్చు.
రేణు : రాజకీయంగా వచ్చిందా ఏమిటి?
జయ : రేణూ! ఒక్కమాట చెపుతాను. నేటి సంస్థలున్ను వ్యక్తులకు కీర్తిధ్వజాలుగా నిలుస్తున్నవి గానీ సంఘాభివృద్ధికోసంగా కనపడటం లేదు.
రేణు : (రిష్టువాచి చూచుకొని) జయా! క్షమించాలి, చైతన్యంగారు ఊళ్లో కేసులు చూచుకొని ఆసుపత్రికి వచ్చే వేళైంది.
జయ : పాపం! చైతన్యంగారు చాలా శ్రమపడుతున్నట్లున్నారు. అనేక మాటలు చెప్పాను గానీ సాయం చెయ్యలేకపోయినాను.
రేణు : ఆయన పడుతున్న శ్రమ ఒకవిధంగానా? - శారీరకంగానూ, మానసికంగానూ, అప్పుతెచ్చి ఉచితవైద్యం చేస్తున్నారు. నీలాపనిందలు మోస్తున్నారు.
జయ : రేణూ! లోకం ఎవరెరుగనిది. నింద ఎప్పుడూ మంచివాళ్ళమీదనే పడుతుంది. వ్యక్తులు నమ్మిచేసే పనికే స్వార్థపరులు కొందరు అపనిందలు కల్పించి కూలదోస్తుంటారు.
రేణు : (లేస్తూ) ప్రయోజనం?
జయ : తమను తప్ప మరెవ్వరినీ లోకం చెప్పుకోకూడదు. అందరూ తనకు ఉపగ్రహాలుగా చుట్టూ తిరుగుతుండాలి.
రేణు : (సాభిప్రాయంగా) అవును, అవును.
జయ : (లేచి కొంతదూరం పంపించి మళ్ళీ వచ్చి కూర్చొని పాపం! చైతన్యంగారు బాధపడుతున్నాడట! ఎవరినైనా చూస్తే చూడటానికి బుద్ధి కలగదు (సాభిప్రాయంగా) ఇటువంటివాళ్ళను చూచే
'లాంగూల చాలన మధ శ్చరణావఘాతం
భూమౌ నిపత్య వదనోదర దర్శనంచ
256
వావిలాల సోమయాజులు సాహిత్యం-2