చైతన్యం : నిష్ప్రయోజనంగా ఎందుకంత దీర్ఘమైన దీవెన వృథా చేస్తావు బ్రహ్మచారిముండావాడిమీద?
చంద్రశేఖరం : అమ్మయ్య (కూర్చుంటూ) - ఘోటక బ్రహ్మచారులుగా ఉండిపోతామని ఘోరమైన శపథాలు చేసిన బ్రహ్మచారి ముండావాళ్లే పెళ్ళిళ్ళమీద పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల తండ్రులై ఇండియా జనసంఖ్య ఊరికే పెంచేస్తున్నారు - ఉఁ. ప్రాక్టీస్ అద్భుతంగా ఉందిటగా -
చైతన్యం : ఏదో బండి నడిచిపోతున్నది. ఎక్కడినుంచి?
చంద్రశేఖరం : సమితి చందాలకని గ్రామగ్రామమూ ప్రచారం చేసుకుంటూ ఊళ్ళో ఉన్నావని ఇలా వచ్చాము.
(చంద్రశేఖరం వెంటవచ్చిన ప్రచారకులు పాడుతూ ఉన్న క్రిందిగీతం లోపలనుంచి వినిస్తుంటుంది)
రైతు కూలి రాజ్యమేను
రామ రాజ్యమూ అహ - రామరాజ్యమూ
కల్ల కపట మెరుక పడని
చల్లనైన రాజ్యము
సాగిరమ్ము రైతుబాబు
చక్క రమ్ము కూలిబాబు ......రైతుకూలి......
ధర్మపథము పట్టినడచి
ధైర్యమూని గడచి గడచి
సౌఖ్యహేతువైనభూమి
స్వర్గసీమ చేరుదాం ..రైతుకూలి....
చైతన్యం : డబ్బాలు నిండుతున్నవా? హడావుడి జాస్తిగా ఉందే!
చంద్రశేఖరం : ఒరేయ్! ఇదంతా ప్రచారపు స్టంటుగానీ డబ్బెవడికి కావాలోయ్. తలచుకుంటే పట్టణంలోనే వసూలు చెయ్యలేమూ - ఆయన చందాలు వసూలు చెయ్యటమంత బాఢకో పని మరొకటి లేదంటే నమ్ము
చైతన్యం : ఏదో ప్రతిఫలం చూపించేశక్తి ఉండాలనుకుంటాను?
డాక్టరు చైతన్యం
247