పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/245

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుణ్యకోటి : ఆ తాకట్టు మరో అందుకు. ఈ అయ్యగారిని సీమకు పంపించి చదువు చెప్పించిందే ఆయన.

(రేణు ప్రవేశిస్తుంది)

పుణ్యకోటి : హల్లో రేణూ! ఒకమాటు మీ ఇద్దరి సేవనూ ప్రశంసించి పోదామని వచ్చాను.

రేణు : (చిరునవ్వుతో) మాకు అన్నివైపులనుంచీ వట్టి ప్రశంసలు గట్టిగా వర్షిస్తూ ఉన్నవి.

పుణ్యకోటి : మావి గట్టి ప్రశంసలు! భుజంగంవంటి పుణ్యాత్ముడు ఊళ్ళో ఉంటే వృధాగా మీరు ఇంత శ్రమపడటమెందుకు?

రేణు : ప్రతిఫలం లేని ఉపకారం ఆయన చెయ్యడేమో!

పుణ్యకోటి : పొరపాటు! ఆయన త్యాగం ఇంకా ఎవరికీ అర్థం కాలేదు. మీరు తలపెట్టిన కార్యక్రమం పెద్దఎత్తుమీద భుజంగంగారు సేవాసమితి తరపున చేయించదలచుకున్నారు. అందులో అనేకమంది నర్సులమీద వైద్యం తెలిసి అజమాయిషీ చేసే నర్సుకు, నెల 1కి 400/- జీతం ఇవ్వటానికని నిశ్చయించు కున్నాడు.

రేణు : అయితే అనేకమంది దొరుకుతారు.

పుణ్యకోటి : ఠాలారోలీ వాళ్ళవల్ల ప్రయోజనం! నీబోటి అకలంకమైన దేశభక్తురాలు కావాలి. భుజంగంగారికి - నేను నీ పేరే సజష్టు చేశాను.

రేణు : థాంక్సు! - కానీ నేను ఆ ఉద్యోగాన్ని స్వీకరించలేను.

పుణ్యకోటి : సమితి ఫండ్సులోనుంచి ఇంకా కావలెనంటె ఎక్కువ జీతం కూడా పుచ్చుకోవచ్చును.

రేణు : చైతన్యంగారిని ఒదిలిపెట్టి నేను ఒంటరిగా ఎక్కడికీ రాలేను.

పుణ్యకోటి : మీరు ఇద్దరూ సమితిలో సర్వీస్ చేస్తే మరీ సంతోషము.

రేణు : ఆయన భుజంగంగారితో ప్రజాసేవలో ఎటువంటి సంబంధం పెట్టుకోరను కుంటాను.


డాక్టరు చైతన్యం

245