పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/237

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


             చిలిపి నవ్వుల తోటి
             సిరిశైలమెక్కాము కామా?... .....అప్పుడె.......


మొగగొంతు :


ఎప్పుడు మరిచానె పిల్లా! ని
న్నెప్పుడు మరిచానె పిల్లా!!
             ఏరు మన్నిద్దర్ని
             వేరు చేస్తే యేమి?
             గుండె గుండే చేరి
             నిండుకున్నా యమ్మి .....ఎప్పుడు......


ఆడగొంతు :


అప్పుడు మరిశావె మామా! న
న్నప్పుడె మరిశావె మామా!!
            గుమ్మడీ పూవంటి
            కొడుకు నియ్యామంటు
            కొండదేవరవోరి
            కోరుకున్నా మోయి! .... అప్పుడె.....


మొగగొంతు :


ఎప్పుడు మరిచానె పిల్లా! ని
న్నెప్పుడు మరిచానె పిల్లా!!
             మబ్బు పట్టిందంటె
             మనసు నీకోసమ్ము
             గునిసి గునిసీ యెంత
             కోరాడు తుందోను ......ఎప్పుడు.....


(రేణు చేతితో సంజ్ఞ చేసి వారిని ఆపుతుంది. డాక్టరు చైతన్యం ప్రవేశించి ముసలయ్య సహాయంతో మందుల పెట్టె సర్దుకుంటాడు)

రేణు : నమస్తే, డాక్టర్‌సాబ్!


డాక్టరు చైతన్యం

237