రావు : మా పత్రికా విలేఖరులపాట రెండువేలు.
మణెమ్మ : మహిళాసంఘం పాట రెండువేల అయిదు వందలు.
చంద్రశేఖరం : (భుజంగం అనుమతితో) భుజంగంగారి పాట మూడువేలు.
పుణ్యకోటి : జయమ్మ సంగీత ప్రదర్శనంపాట మూడువేల అయిదు వందలు.
చంద్రశేఖరం : మణెమ్మగారు వెనక్కు తీస్తున్నారు.
మణెమ్మ : మా పాట నాలుగువేలు.
చంద్రశేఖరం : భుజంగంగారి పాట అయిదువేలు.
భుజంగం : ఇంతటితో ఆపితే బాగుంటుంది.
పుణ్యకోటి : భుజంగంగారిపేర పాట కొట్టేశాం అయిదువేలు.
మణెమ్మ : మహిళాసంఘం చేతగానీ, ఉద్యోగసమితి చేతగానీ కొంతడబ్బు చందా వేయిస్తాను. సమితికి పదివేలు పోగు చెయ్యాలి.
రావు: అద్భుతంగా ఉందప్పా!
చంద్రశేఖరం : మణెమ్మగారి పాటతో ఈ మన కార్యక్రమం ముగిసి పోతుంది.
మణెమ్మ : సమయానికి సంబంధించినదే కానీ ఓ పాట అంటాను.
పుణ్యకోటి : ఆలోచిస్తే అన్ని పాటలూ అన్ని సమయాలకు సరిపోయి ఉంటవి.
మణెమ్మ : (గొంతు సవరించుకొని ఇంగ్లీషు డాన్సులాగా ఫాక్సు ట్రాట్‌లో)
లే, లే! లే, లే! లే, లే! లే, లే!!
కాలం స్వల్పం భోగ్యమోయ్
సౌఖ్యం సర్వం సాధ్యమోయ్!! లే, లే,
నిన్న లేదు రేపురాదు.
నేడే నేడే. నేడే, నోయ్!
లే, లే! లే, లే! లే, లే! లే, లే!!
బుడే : అచ్ఛా, బహుత్ అచ్చీ అచ్చీ బాత్ హై (భుజంగాన్ని చూచి భయపడి)
ఆదాబరస్.
232
వావిలాల సోమయాజులు సాహిత్యం-2