పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/230

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రశేఖరం : జాతీయ ముస్లిం ప్రాతినిధ్యం.

మణెమ్మ : మా మహిళాలోకం సంగతి మరిచిపోవద్దని మనవి.

పుణ్యకోటి : అందుకనే సగానికి సగం. ఒక కార్యదర్శి, ఉపాధ్యక్షపదవులు రెండూ మీ స్త్రీ లోకానికిచ్చాం.

రావు : మా రిపోర్టులో ఈ విషయం ప్రత్యేకంగా మెన్షన్ చేస్తామప్పా!

భుజంగం : ఈ సంగతంతా ఏమిటో నాకు ఇంతవరకూ అర్థం కాలేదు.

పుణ్యకోటి : నగర సేవాసమితికి అధ్యక్షులుగా ఉంటున్నారని తెలిస్తే చాలును. (రిపోర్టు చూపిస్తే ఇద్దరూ చూస్తారు)

చంద్రశేఖరం : (పుణ్యకోటివంక చూస్తాడు - పుణ్యకోటి నీవే కానివ్వమన్నట్లు సంజ్ఞ చేస్తాడు)

నగర సేవాసమితికి భుజంగంగారిని అధ్యక్షులుగానూ, మణెమ్మగారిని ఉపాధ్యక్షులు గానూ ఎన్నుకున్నాము.

(కరతాళధ్వనులు)

జయమ్మ సహాయ కార్యదర్శి పుణ్యకోటి కార్యదర్శి.

(కరతాళధ్వనులు)

జయ : మామయ్యగారూ క్షమించాలి నేను అంగీకరించలేను.

మణెమ్మ : అల్లా వీల్లేదు. నీవు తప్పకుండా అంగీకరించాలి. పుణ్యకోటిగారితో కలిసి పని చెయ్యటానికి వెనుకాడడ మెందుకు?

పుణ్యకోటి : అధ్యక్షులూ, ఉపాధ్యక్షులూ ఈ ఆసనాలు అలంకరించాలి.

(కూర్చున్న తరువాత మెళ్ళో దండలు వేసి కార్యక్రమం చేతికిస్తారు)

భుజంగం : 'ప్రార్థన’

పుణ్యకోటి : (జయమ్మవైపు చూస్తాడు)

జయ : (తప్పనిసరిగా లేచి నిలబడుతుంది)

బుడే : (వెళ్ళిపోబోతాడు)


230

వావిలాల సోమయాజులు సాహిత్యం-2