అలరాజు : ఛలోక్తికన్నాను. అత్యవసరము.
బ్రహ్మన్న : (మందమందంగా) సౌమ్యంగానే సమయం వారు చెల్లించారు. అర్ధరాజ్యం పంచిఇమ్మని చెప్పు. అన్నదమ్ముల్లో అంతః కలహాలు దేశానికీ ప్రజకూ అపాయమని చెప్పు. నలగామ రాజులుంగారి మీద మలిదేవ రాజు గారికి ఉండుకున్న ప్రేమను ఉద్ఘాటించు. నా రాజభక్తిని విశదీకరించు.
సంధి సానుకూల పడనట్లు తోచిందా - ఈ మధ్య సభలో నాగమ్మ నలగామ రాజులుంగారి ముందే నరసింహ రాజులుంగారిని విశేషంగా పొగడిందట. అది అతణ్ణి ఉలికించనో, మనను మోసగించనో కనిపెట్టి వీలునుబట్టి భేదోపాయము ప్రయోగించు. నాయకురాలన్న ప్రతి ముక్కా జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పు. అదనంగా పుచ్చుకొన్న ఆరునెలల పుల్లరీ నీవెంట తీసుకొని రా. గోవులను విడిపించమను.
ఇంతగ చెప్పనేమిటికి? ఈవొక వేత్తవు రాజనీతి, వృ
త్తాంతము సర్వమున్ దెలియు, ధర్మమునం దనురక్తి నీకు, అ
త్యంత కృపాభరమ్ము హృదయమ్ములపై గల ఈ ప్రజాళిపై
స్వాంతము చల్లనై చెలగ సర్వము దిద్దుము బాంధవంబునన్.
సమర్థుడివి. విశేషించి చెప్పవలసిన పని లేదు. చెన్నకేశవ కృపవల్ల నీ పని
నెరవేరుతుంది. (దీవిస్తాడు).
అలరాజు : (కొమ్మన్న ముఖంగా తిరిగి) తండ్రీ!
కొమ్మన్న : సర్వసమర్ధులు మహామంత్రులు చెప్పిన తరువాత నేను చెప్పవలసినది ఏమీ ఉండదు. అయితే మన వైషమ్యాలను మనస్సులో పెట్టుకొని మాత్రం తొందర పడవద్దు. వాళ్ల దౌర్గత్యాలను ఖండించ వలసి వస్తే వెనుదీయనూ వద్దు. వీరకొమ్మన్న కొడుకువనిపించుకో. మంచనశర్మ చెప్పాడు. నీ జన్మనక్షత్రం పుష్యమిట - ఇవాళ రోహిణి. తారాబల చంద్రబలాలు కుదిరినవట. కోడలు పేరిందేవికి నా ఆశీస్సులు.
అలరాజు : (మలిదేవుడి ముఖంగా తిరిగి) మహారాజా!
మలిదేవుడు : అలరాజూ! నాయకురాలు సంధి పొసగనిస్తుందా? పురుష ప్రయత్నం చేయక తప్పదు. ఒంటరిగా నలగాముడితో అర్ధరాజ్యం సమానంగా అనుభవిస్తూ రాజ్యభోగాలల్లో తేలిపోతూ ఉండవలసిన మీ తమ్ములు అడవుల్లో అష్టకష్టాలూ
నాయకురాలు
23