పుట 197 - ఇన్నిమాట లెందుకు గాని పర మొకటున్న దన్న భయభావము లే కిటు పాపబుద్ధినై తరుణిని రూపసంపదల దర్పకమోహనజన్మభూమి నో హరిహరి! ఓ విధాత!! రతి కైనను వందనమాచరింపఁగా నొరలెడు దాని - నేగతిగ నోడెద నే వచియింప నాపయిన్. పుట 200 - నేను మాత్రం నిర్భాగ్యుణ్ణి ఏనిర్భాగ్యుఁడ - కానిచో నిటులనౌనే - నీవు ప్రేమామృత శ్రీనిష్యందినివై మదీయ హృదయోర్విన్ దృప్త 'గావింపఁగా రానేవచ్చినవేళ వచ్చె నిటు దుర్వారాగ్ని కీలాళితో, నీనవ్యాకృతితో మహాప్రళయ మం దే దగ్ధమైపోవగన్. పుట 201 (మెడలో జందెము తీసి) - తుది నీకీయఁగ నాకు దక్కినది, సంతోషింపు మో తండ్రి! నీ కిదియే బ్రాహ్మణబిడ్డకున్ నగ - ఇదేమీ స్వర్ణహారంబు కా దిది ముప్పేటల ముత్తెపున్ సరము కానేకాదు - ఇద్దాననే తుది నీ తాతలు తండ్రులున్ సురలు సంతోషింతురో పుత్రకా! పుట 201 - ఎక్కడికి వెళ్ళుతున్నారో చెప్పమన్నావా! మాసినకీర్తితోడ, దయమాలిన శూలముతో, గళంబునన్ భాసుర రక్తమాలికల బంధుర దుఃఖకఠోరవహ్నితో నోసుత! యేఁగుచుంటి యముఁడుజ్జ్వలుఁడౌచు ప రేత భస్మసిం హాసన మెక్కి చేసిడి మహాధ్వరభూమికి నే హవిస్సునై. పుట 201 - కలిచేస్తున్నవి తండ్రీ! వేయేండ్లాయువు కల్గుఁగాక భువి నా ప్రేమోదధీ, తండ్రీ! రా రా, యాహ్లాదముతోడ ముద్దిడుము, నీయాశ్లేష సౌఖ్యంబు నం దీయత్యంతదరిద్రదేహమున కయ్యెన్ జందనాలేపముల్ . ఏయౌశీనర చర్చ తుల్యమగు నోయీ, తండ్రి కిద్దానితోన్. - వసంతసేన 211
పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/211
ఈ పుటను అచ్చుదిద్దలేదు