పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/194

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధికరణకుడు: చారుదత్తయ్య వారికి ఒక ఆసనమీయరా! శోధనకుడు : ఇటు దయచెయ్యండి. చారుదత్తుడు : (అధికరణకునికి నమస్కరిస్తూ కూర్చుంటాడు) శకారుడు : స్త్రీ ఘాతుకులకూడా ఆసనమిచ్చి గౌరవిస్తారా? కానియ్యండి, కానియ్యండి. మా బావగారికి తెలియకుండానే దేశంలో అధర్మం, అక్రమం, అన్యాయం నడుస్తూ ఉన్నది. అధికరణకుడు : (శకారునితో) న్యాయస్థానంలో మీరు చాలా శాంతంగా ప్రవర్తించాలి. (చారుదత్తునితో) అయ్యా! మీకీ పట్టణంలో ఎవరైనా స్త్రీ స్నేహితులున్నారా? చారుదత్తుడు : (సిగ్గుతో తలవంచుకుంటాడు) శకారుడు : (అధికరణకునితో) సిగ్గు నటిస్తూ చేసిన పని కప్పి పుచ్చు తున్నాడు, జాగ్రత్తగా కనిపెట్టు. అధికరణకుడు : ఆర్యా! ఇది వ్యవహారము. సిగ్గుతో ప్రయోజనం లేదు. శకారుడు : (గర్విపోతుగా) అందులో వ్యవహారం నాతో రాజశ్యాలకులతో - జాగ్రత్త! చారుదత్తుడు : మీతో వ్యవహారం దుస్సాహసమే. శకారుడు : రత్నహారాలకు ఆశపడి రాణిలాంటి నా ప్రియను గొంతు పిసికి జీర్ణోద్యానంలో పారేస్తావు(ట్రా! చారుదత్తుడు : అసంబద్ధాలాడకు. అధికరణకుడు : అయితే, ఇప్పుడు ఆమె ఎక్కడ యున్నది? చారుదత్తుడు : నా కేమీ తెలియదు. శకారుడు : అదీ సంగతి, అలా బయటపడు. మదనిక : అయ్యా! నాదొక మనవి. చారుదత్తులవారు రత్నహారాలకు ఆశపడేవారనటం అసంబద్ధం. ఒకప్పుడు వారింట్లో దాచిపెట్టిన హారం దొంగలెత్తుకుపోతే దానికి బదులుగా మా అక్కకు రత్నహారమిచ్చారు. 194 వావిలాల సోమయాజులు సాహిత్యం-2