పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/193

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శకారుడు : మెడ వాచింది. ఆభరణాలు లేవు. అధికరణకుడు : అంతమాత్రాన చారుదత్తయ్య దోషియని నిశ్చయించటానికి వీలులేదు. శకారుడు : నిన్నటి సాయంత్రం నా ప్రియురాలు, మదనికతో చారుదత్తుని ఇంటికెళ్ళింది. తరువాత దానికీ స్థితి పట్టింది. అధికరణకుడు : మీ ప్రియురాలు వారి ఇంటికి ఎందుకు వెళ్ళిందని మీ అభిప్రాయం? శకారుడు : సంగీతం నేర్చుకోటానికి - అది మీకు అనవసరమైన ప్రశ్న. అధికరణకుడు : శోధనకా! - మదనిక. శోధనకుడు : మదనికా?... కొంచెం ముందుకు. మదనిక : (కొంచెం ముందుకు వచ్చి నిలబడుతుంది). అధికరణకుడు : అమ్మాయీ! శకారయ్యగారు చెప్పేమాటలన్నీ నిజమేనా? మదనిక : ఆర్యచారుదత్తులు పిలుచుకోరమ్మన్నారని ఉద్యానవనానికి మా అక్కను వర్ధమానకుడు బండి ఎక్కించుకోవెళ్ళాడు. అధికరణకుడు : మీ అక్కను చారుదత్తయ్య హత్య చేశాడని నీవు నమ్ముతావా? మదనిక : ఆమెమీద అంతటి అనురాగం ఉన్నవాళ్ళు ఈ ఉజ్జయనీ పట్టణంలో మరెవ్వరూ లేరు. అధికరణకుడు శకారయ్యా! వింటున్నావా? దీనికి నీవేమంటావు? శకారుడు : అది చిన్నపిల్ల. దానికేం తెలుసు, దాని మొఘం. ఆ మాటలు నమ్మవద్దు. చారుదత్తుడే చంపాడు. అధికరణకుడు : శోధనకా! చారుదత్తయ్య. శోధనకుడు : చారుదత్తయ్య! చారుదత్తయ్య!! (ఇద్దరు రక్షకభటులు తీసుకోవచ్చి నిలవబెడితే చారుదత్తుడు వచ్చి తలవంచుకొని నిలవబడతాడు) శకారుడు : (కోపంతో) ఓరి స్త్రీమాతుకా! నీ మొఘం చూడకూడదు. పంచమహాపాతకాలూ చుట్టుకుంటవి. వసంతసేన 193